Share News

Helicopter: వేలాంకన్నిలో హెలికాప్టర్‌ సేవలు..

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:59 AM

తమిళనాడు రాష్ట్రంలోని వేలాంకన్నికి వెళ్లేందుకు హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వేలాంకన్ని ఆరోగ్యమాత ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వెళుతుంటారు. అయితే.. వీరి సౌకర్యార్థం హెలికాప్టర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.

 Helicopter: వేలాంకన్నిలో హెలికాప్టర్‌ సేవలు..

- ఈ నెలాఖరు నుంచి ప్రారంభం

చెన్నై: నాగపట్టినం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వేలాంకన్ని ప్రాంతంలో ఈ నెలాఖరు నుంచి హెలికాప్టర్‌(Helicopter) సేవలు ప్రారంభం కానున్నాయి. వేలాంకన్ని ఆరోగ్యమాత ఆలయం, నాగూర్‌ దర్గా, సిక్కల్‌ సింగారవేలర్‌ ఆలయం తదితర సుప్రసిద్ధ ఆలయాలు సహా పలు పర్యాటక స్థలాలు ఉన్నాయి. వీటితో పాటు కోడియక్కరై పక్షుల శరణాలయం, పొడవైన సముద్రతీరం, రాష్ట్రంలో ఎత్తయిన లైట్‌హౌస్‌ కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ స్వల్ప సమయంలో పర్యాటకులు వీక్షించడానికి అనువుగా హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.


ఉత్తరఖండ్‌, కశ్మీర్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక ప్రాంతాలను, ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వీక్షించడానికి హెలికాప్టర్‌సేవలున్నాయి. ఆ రీతిలోనే నాగపట్టినంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను తిలకించడానికి హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వేలాంకన్ని ఆలయ స్థలంలో హెలిపాడ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వేలాంకన్ని చుట్టూ సుమారు 25 కి.మీ.ల విస్తీర్ణం వరకు పర్యాటకులు ప్రయాణించేందుకు హెలికాప్టర్‌ సేవలను అందించనున్నారు.


nani1.2.jpg

ప్రస్తుతం ఆరుగురు కూర్చుని ప్రయాణించడానికి వీలున్న హెలికాప్టర్‌ ఉపయోగించాలని, ఇందులో ప్రయాణించడానికి రూ.6వేలు చార్జీగా వసూలు చేయనున్నారు. ఈ సేవలకుగాను బెంగళూరు నుండి ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్‌ను తెప్పించనున్నారు. ఈ హెలికాప్టర్‌ సేవలకు లభించే స్పందన బట్టి తిరుచ్చి, చెన్నై నగరానికి కూడా హెలికాప్టర్‌ సేవలను విస్తరింపజేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెలాఖరున ఈ హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం

ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 08 , 2026 | 11:59 AM