Tamilnadu: వేడెక్కిన తమిళ రాజకీయాలు.. ఎన్డీయే కూటమిలో చేరిన పీఎంకే
ABN , Publish Date - Jan 07 , 2026 | 04:09 PM
అంబుమణి రామదాస్‌తో కలిసి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ, పీఎంకే చేరికతో కూటమి మరింత బలపడిందని, మరి కొన్ని పార్టీలు కూడా తమ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయన చెప్పారు. తమది విక్టరీ అలయెన్స్ అని ప్రకటించారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Elections) దగ్గరపడుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి (NDA)తో పట్టాలి మక్కల్ కట్టి (PMK) చేతులు కలిపింది. పీఎంకే అధ్యక్షుడు అంబుమణి రామదాస్ (Anbumani Ramadoss) తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలుసుకుని ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు.
అంబుమణి రామదాస్‌తో కలిసి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ, పీఎంకే చేరికతో తమ కూటమి మరింత బలపడిందని, మరి కొన్ని పార్టీలు కూడా తమతో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయన చెప్పారు. తమది 'విక్టరీ అలయెన్స్' అని ప్రకటించారు.
అన్నాడీఎంకే నాయకత్వంలో ఎన్డీయేలో చేరేందుకు పీఎంకే చేతులు కలిపినట్టు అంబుమణి రామదాస్ తెలిపారు. మహిళల భద్రత, రైతులు, నిరుద్యోగం వంటి అంశాల్లో అధికార డీఎంకేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని చెప్పారు. భారీ మెజారిటీతో గెలిచి అన్నాడీఎంకే నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ ఏడాది ప్రధమార్ధంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
పశ్చిమ దేశాల కపటత్వంపై జైశంకర్ సీరియస్
ఉద్రిక్తతకు దారి తీసిన అక్రమ నిర్మాణాల తొలగింపు.. పోలీసులపై రాళ్ల దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి