Home » Tamil Nadu
అసెంబ్లీ ప్రసంగంలో సీఎం విజయ్ తన కుడిచేతితో గడ్టాన్ని పైకి లేపేట్టుగా చేసిన హావభావంపై ప్రతిపక్ష డీఎంకే మండిపడుతోంది. దీనిపై దుమారం రేగడంతో అది అనుకోకుండా వచ్చిన 'బాడీ లాంగ్వేజ్' అని విజయ్ వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని రేణిగుంట-అరక్కోణం మధ్య 77 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ లైన్ల నిర్మాణంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు, అలాగే తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలకు వెళ్లే భక్తులకు కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది.
తమిళనాడులో సీఎం సి.విజయ్ నేతృత్వంలోని కూటమికి అధికారికంగా ఎస్ఎస్‌జేవీఏ అనే పేరు ఖరారైంది. మొత్తం 5 పార్టీలు ఇందులో భాగమయ్యాయి.
తమపై కరుప్పస్వామి ఆవహించినట్లు చెబుతున్న దంపతులు గత నాలుగురోజులుగా గ్రామమంతటా నగ్నంగా ఊరేగిన ఘటన తిరుపత్తూరు సమీపంలో జరిగింది.
తమిళనాడు, పుదుచ్చేరిలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 6న పోలింగ్, 9న ఫలితాలు వెలువడనున్నాయి.
పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్‌ల సంరక్షణపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 18 నెలల పాటు భద్రపరచాల్సి ఉండగా, 15 రోజులు మాత్రమే ఎందుకు ఉంచుతున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తన ప్రియురాలు వారం రోజులుగా మాట్లాడకపోవడాన్ని తట్టుకోలేని ఓ ప్రేమోన్మాది ఆమె ఇంటిపై పెట్రోల్ బాంబ్ విసిరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నగరాన్ని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికను ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 100 శాతం వీవీప్యాట్ రీవెరిఫికేషన్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది.
తమిళనాడులో విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 52 ప్రధాన ఆలయాలలో స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై టీవీకే ప్రభుత్వం పూర్తి స్థాయి నిషేధాన్ని విధించింది.