Share News

చెన్నై బీచ్‌ నుంచి చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Jan 27 , 2026 | 02:00 PM

చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చెన్నై బీచ్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

 చెన్నై బీచ్‌ నుంచి చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

చెన్నై: చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌(Charminar Express) సహా మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చెన్నై బీచ్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే(Southern Railway) విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి... ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌లో పునరుద్ధరణ పనుల కారణంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు చేపట్టారు. ఆ ప్రకారం, మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు చెన్నై బీచ్‌ నుంచి బయల్దేరనున్నాయి.


zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz.jpg

చెన్నై బీచ్‌ -ముంబై సీఎస్ఎంటీ సూపర్‌ఫాస్ట్‌ రైలు ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్‌ 4వ తేది వరకు చెన్నై బీచ్‌ నుంచి బయల్దేరనుంది. హైదరాబాద్‌ చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్‌ 5వ తేది వరకు చెన్నై బీచ్‌ స్టేషన్‌ నుంచి నడుస్తుంది. అలాగే, ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్‌ 4వ తేది వరకు చెన్నై బీచ్‌ రైల్వేస్టేషన్‌ వరకు మాత్రమే నడువనుందని దక్షిణ రైల్వే తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి.

చైనా మాంజాకు ఐదేళ్ల బాలిక బలి

హింసను ప్రశ్నించినా బెదిరింపులే!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 27 , 2026 | 02:00 PM