Share News

సనాతన ధర్మంపై ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు.. హైకోర్ట్ సీరియస్

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:56 PM

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయనిధికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

సనాతన ధర్మంపై ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు.. హైకోర్ట్ సీరియస్
Udayanidhi Stalin Controversy

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధి స్టాలిన్ 2023 సెప్టెంబర్‌లో ‘సనాతన నిర్మూలన సదస్సు’లో సనాతన ధర్మంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఇవి అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్ని రేపాయి. సనాతన ధర్మాన్ని దోమలు, డెంగ్యూ, మలేరియాతో పోల్చి.. దాన్ని నిర్మూలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా.. మద్రాస్ హైకోర్టు దీనిపై స్పందించింది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన కామెంట్స్ విద్వేషపూరిత ప్రసంగమేనని వ్యాఖ్యానించింది.


ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ.. బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టడంపై దాఖలైన కేసును హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా.. మాలవీయ చేసిన పోస్ట్ ఎలాంటి నేరం కిందకు రాదని తెలిపింది. దేశంలో సనాతన ధర్మాన్ని పాటించేవారిని లక్ష్యంగా చేసుకుని ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలంపై అసహనం వ్యక్తం చేస్తూ అవి ముమ్మాటికీ రెచ్చగొట్టే ప్రసంగం కిందకే వస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. తమిళనాడులో ఈ విషయంపై ఉదయనిధి ప్రసంగించినప్పటికీ ఎలాంటి కేసు నమోదు కాలేదని.. ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదైన విషయాన్ని మద్రాస్ హైకోర్టు ప్రస్తావించింది.


ఈ వార్తలు కూడా చదవండి.

వచ్చే ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌కు కొత్త సిలబస్‌

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2026 | 04:14 PM