Share News

మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. నితిన్ నబీన్ నా బాస్ అంటూ..

ABN , Publish Date - Jan 20 , 2026 | 09:55 PM

నితిన్ నబీన్ సిన్హా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళవారం మొదటి సారి పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. నితిన్ నబీన్ నా బాస్ అంటూ..
Nitin Nabin BJP

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ సిన్హాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. నబీన్ తనకిప్పుడు బాస్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక సాధారణ కార్యకర్త అని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరు. దేశ సేవ, ప్రజా సేవ లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పని చేస్తున్నారు. గతంలో అడ్వాణీ, వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఘన విజయాలు సాధించాం. బీజేపీ కార్యకర్తను అనిపించుకోవటమే నాకు గర్వకారణం. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలి’ అని అన్నారు.


కాగా, నితిన్ నబీన్ సిన్హా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళవారం మొదటి సారి పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని మోదీపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని మోదీ నిరంతరంగా దేశం కోసం పాటు పడుతున్న తీరును సాధారణ కార్యకర్తలుగా తాము గమనిస్తూనే ఉన్నామని అన్నారు. నితిన్ నబీన్ సిన్హా ప్రతి పక్షాలపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం గుప్పించారు. తమిళనాడు ప్రభుత్వం తిరుప్పరన్కుండ్రం కొండపై కార్తీగై దీపం పండుగ జరగకుండా ఆపడాన్ని ఆయన తప్పుబట్టారు.


ఇవి కూడా చదవండి

ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవ్: హోంమంత్రి అనిత

మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ఈయూ చీఫ్

Updated Date - Jan 20 , 2026 | 10:02 PM