Home » Tamil nadu Assembly Elections 2026
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొంది సంచలనం సృష్టించారు. తిరుపత్తూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిపై కేవలం ఒక్క ఓటు మెజార్టీతో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు.
తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా చూడలేం. గతంలో తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినిమా రంగానికి చెందిన వారే. ఆ తర్వాత కూడా ఎంతో మంది సినిమా నటులు రాజకీయ పార్టీలు పెట్టారు.
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టిన విజయ్ సారథ్యంలోని టీవీకే విజయపథంలోకి దూసుకెళ్తోంది. అయితే మెజారిటీకి 118 సీట్లు అవసరమవుతాయి. మెజారిటీ తగ్గిన పక్షంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏయే పార్టీలతో టీవీకే సంప్రదింపులు జరిపే అవకాశం ఉందనే దానిపై తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగా వెట్రి కజగం' పార్టీ అధినేత, నటుడు విజయ్ సత్తా చాటుతున్నారు. 100కు పైగా శాసనసభ సీట్లలో ముందంజలో ఉండడంపై విజయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాట ప్రస్తుతం 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ గెలుస్తారని తాము ముందే చెబితే అంతా నవ్వారని అన్నారు. అయితే, ఈ విజయం తమది కాదని డేటా సైన్స్‌ది అని అన్నారు.
ప్రముఖ నటి త్రిష కృష్ణన్ సోమవారం 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలు డీఎంకే, ఏడీఎంకే చుట్టే తిరుగుతున్నాయి. అయితే డీఎంకే, లేదంటే ఏడీఎంకే అధికారంలోకి వస్తూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత మూడో పార్టీ ఈ రెండింటినీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వచ్చింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ దూసుకుపోతోంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలను వెనక్కి నెట్టి టీవీకే పార్టీ అగ్రస్థానానికి దూసుకుపోతోంది.
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ హవా కొనసాగుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. దీంతో విజయ్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆశ్చర్యకర ఫలితాలను వెల్లడించే అవకాశం కనబడుతోంది. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉత్కంఠభరితంగా మారగా, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దాటినట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.