ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్‌ని చూసి గర్వపడుతున్నా: ఎస్.ఎ.చంద్రశేఖర్..
ABN , Publish Date - May 04 , 2026 | 02:57 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగా వెట్రి కజగం' పార్టీ అధినేత, నటుడు విజయ్ సత్తా చాటుతున్నారు. 100కు పైగా శాసనసభ సీట్లలో ముందంజలో ఉండడంపై విజయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కజగం' పార్టీ అధినేత, నటుడు విజయ్ సత్తా చాటుతున్నారు. 100కు పైగా శాసనసభ సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తూ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో ముందంజలో ఉండడంపై విజయ్ తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌కు తండ్రి అయినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని సినీ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడికి అభినందనలు తెలిపారు.
పొత్తు లేకుండానే టీవీకే విజయం సాధించడం విజయ్ ధైర్యసాహసాలను చూపిస్తోందని చంద్రశేఖర్ చెప్పారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వంతోనే విజయ్ పైకి వచ్చారని అన్నారు. తాను దర్శకుడైనా విజయ్ అవకాశాలను వెతుక్కుంటూ సొంతంగానే సినిమాల్లో నిలదొక్కుకుని ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్లుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలని విజయ్ కోరుకున్నారని, ఈరోజు అది నిజం కాబోతోందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. టీవీకే ముందంజలో ఉండటంపై విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. విజయం దిశగా తన కుమారుడు దూసుకెళ్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం
కౌంటింగ్ కేంద్రాలు వదలొద్దు.. తుది ఫలితాలు మనవైపే: మమతా బెనర్జీ