విజయ్ నివాసానికి త్రిష.. టీవీకే అధినేతకు అభినందనలు
ABN , Publish Date - May 04 , 2026 | 01:45 PM
టీవీకే అధినేత, దళపతి విజయ్ నివాసానికి నటి త్రిష చేరుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఆధిక్యం కనబర్చడంపై విజయ్‌కు త్రిష అభినందనలు తెలియజేశారు.
చెన్నై, మే 4: టీవీకే అధినేత, దళపతి విజయ్ నివాసానికి నటి త్రిష చేరుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం(TVK) ఆధిక్యం కనబర్చడంపై విజయ్‌కు త్రిష అభినందనలు తెలియజేశారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని త్రిష దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని త్రిష దర్శించుకుని.. వేదిపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయ్ నివాసానికి చేరుకుని ఆయనకు అభినందనలు తెలిపినట్లు సమాచారం. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన త్రిషతో ‘మేడం ఈ రోజు రిజల్స్ట్ మనదే’ అని ఓ అభిమాని అన్నాడు. ఇందుకు త్రిష నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్స్‌లో త్రిష ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చారు. త్రిషతో పాటు 'జన నాయగన్' హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
మరోవైపు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త దూరంలో టీవీకే పార్టీ నిలిచింది. విజయ్‌తో కాంగ్రెస్, సీపీఐ నేతలు టచ్‌లోకి వెళ్లగా.. పీఎంకే కూడా టీవీకే పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏఐఏడీఎంకేతో అధికారం పంచుకునేందుకు విజయ్ విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. పీఎంకే 6, కాంగ్రెస్ 5, సీపీఐ రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. పొత్తులపై నేటి సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
సంత్ త్యాగరాజ 259వ జయంతి.. డిప్యూటీ సీఎం పవన్ నివాళులు
తీరు మార్చుకోకపోతే.. వైసీపీకి గుండు సున్నా ఖాయం: మంత్రి నారాయణ
Read Latest National News And Telugu News