Home » T20 World Cup
విండీస్‌పై టీమిండియా ఆడిన తీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఎప్పటిలాగానే పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.
పెద్దగా అంచానాల్లేని సంజూ శాంసన్ ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు ఆపద్భాందవుడిలా నిలిచాడు. అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టును సెమీ ఫైనల్ చేర్చాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.
వెస్టిండీస్‌తో చివరి సూపర్ 8 మ్యాచ్‌లో తలపడుతున్న భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
టీ20 ప్రపంచ కప్2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది గంటలకే పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సంచలన ప్రకటన చేశాడు. రిటైర్మెంట్ విషయంలో తన మనసు మార్చుకున్నట్లు ప్రకటించాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాది.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
పొట్టి ప్రపంచ కప్ నుంచి శ్రీలంక జట్టు ఓటమితో తప్పుకున్న సంగతి తెలిసిందే. నిన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆ జట్టు కోచ్, దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఐసీసీ నిర్వహించే అన్ని మ్యాచులు ఒకఎత్తు అయితే.. ఇండియా, పాక్ మ్యాచ్ మరో లెవెల్ ఉంటుంది. ఈ మ్యాచులకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో లీగ్ దశలో భారత్, పాక్ తలపడ్డాయి. మరోసారి కూడా తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్2026 సూపర్ -8లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తర ఫైట్ ప్రారంభంకానుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు చావోరేవో లాంటింది.
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు తన మెంటార్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పు చూపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌటైన అభిషేక్ శర్మ.. జింబాబ్వేతో గురువారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీస్‌కు చేరే విషయంలో కొన ఊపిరితో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఇంగ్లండ్ ప్రాణం పోసింది. శుక్రవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించడంతో పాక్ అనూహ్యంగా సెమీ ఫైనల్ రేసులోకి వచ్చింది.