టీ20 ప్రపంచ కప్: యాన్సెన్ హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్ టార్గెట్ 170
ABN , Publish Date - Mar 04 , 2026 | 08:54 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. కివీస్‌కు 170 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. కివీస్‌కు 170 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. సఫారీల బౌలింగ్ ఆల్‌రౌండర్ యాన్సెన్(55*) హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు.
కివీస్ బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 80 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయి పడ్డ సౌతాఫ్రికాను.. యాన్సెన్(55*) ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా క్రీజులో నిలదొక్కుకుని ఆఖరి వరకు పోరాడాడు. అతడి వల్లే ప్రొటీస్ జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. స్టబ్స్(29)తో కలిసి ఆరో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. డేవాల్డ్ బ్రెవిస్(34) కాస్త పర్వాలేదనిపించాడు. ఐడెన్ మార్క్‌రమ్(18), క్వింటన్ డికాక్(10), ర్యాన్ రికెల్టన్(0), డేవిడ్ మిల్లర్(6), బాష్(2), రబాడా(0) తీవ్రంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 2, కోంచీ 2, రచిన్ రవీంద్ర 2, ఫెర్గుసన్, నీషమ్ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్‌లో సంచలన రికార్డ్!
ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ పోరు