టీ20 ప్రపంచ కప్ సెమీస్: భారత్-ఇంగ్లండ్ మ్యాచ్.. గత ప్రదర్శనలు ఇలా!
ABN , Publish Date - Mar 05 , 2026 | 05:22 PM
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 కీలక దశకు చేరుకుంది. సెమీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్-భారత్ సెమీ ఫైనల్స్ 2లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 మ్యాచుల్లో టీమిండియా-ఇంగ్లండ్ గత ప్రదర్శనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 కీలక దశకు చేరుకుంది. సెమీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్-భారత్ సెమీ ఫైనల్స్ 2లో తలపడనున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళుతుంది. కాగా ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. సూపర్ 8లో సౌతాఫ్రికాపై మినహా అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్‌పై కూడా నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లాలని.. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీ20 ముఖాముఖి మ్యాచుల్లో టీమిండియా-ఇంగ్లండ్ గత ప్రదర్శనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే..
ప్రపంచ కప్ టోర్నీలో..
పొట్టి ప్రపంచ కప్ మ్యాచుల్లో భారత్-ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 3, ఇంగ్లండ్ 2 మ్యాచుల్లో గెలిచాయి. వరల్డ్ కప్ మ్యాచుల్లో ఇంగ్లండ్‌పై భారత్ చేసిన అత్యధిక స్కోర్ 218 పరుగులు కాగా అత్యల్పంగా చేసింది 150 పరుగులు. మరోవైపు ఇంగ్లండ్ భారత్‌పై అత్యధికంగా 200 పరుగులు చేసింది. ఓ మ్యాచ్‌లో అత్యల్పంగా 80 పరుగులకే కుప్పకూలింది.
ఓవరాల్‌గా జట్టు ప్రదర్శనలు..
ఈ పొట్టి ఫార్మాట్లో భారత్-ఇంగ్లండ్ జట్లు ఇప్పటి వరకు 29 సార్లు తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించగా.. 12 మ్యాచుల్లో ఇంగ్లండ్ గెలుపొందింది.
స్వదేశంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో టీమిండియా 10 మ్యాచుల్లో గెలవగా.. ఇంగ్లండ్ ఐదుసార్లు నెగ్గింది.
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా 4, భారత్‌లో టీమిండియాపై ఇంగ్లండ్ 6 మ్యాచుల్లో గెలిచాయి. తటస్థ వేదికల్లో భారత్ 3, ఇంగ్లండ్ 1 మ్యాచులో విజేతలుగా నిలిచాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం.. హాజరైన మాజీ క్రికెటర్లు
టీ20 వరల్డ్ కప్: భారత్ - ఇంగ్లండ్ సెమీఫైనల్.. కీలకం కానున్న టాస్.!