Share News

టీ20 ప్రపంచ కప్: ఫిన్ అలెన్ విధ్వంసం.. ఫైనల్‌కు కివీస్

ABN , Publish Date - Mar 04 , 2026 | 10:06 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్.. కేవలం 12.5 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.

టీ20 ప్రపంచ కప్: ఫిన్ అలెన్ విధ్వంసం.. ఫైనల్‌కు కివీస్
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్.. కేవలం 12.5 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అలెన్(100*) సెంచరీతో చెలరేగాడు. కాగా గురువారం గెలిచే జట్టుతో న్యూజిలాండ్ ఫైనల్‌లో తలపడనుంది.


కివీస్ బ్యాటర్ల ధాటికి సఫారీ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఏ బంతి సంధించినా బౌండరీ వైపే మళ్లించి చెమటలు పట్టించారు. టిమ్ సీఫర్ట్(58) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రచిన్ రవీంద్ర(13*) నాటౌట్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా మాత్రమే వికెట్ తీయగలిగాడు. మిగతా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.


అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. సఫారీల బౌలింగ్ ఆల్‌రౌండర్ యాన్సెన్(55*) హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. స్టబ్స్(29)తో కలిసి ఆరో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. డేవాల్డ్ బ్రెవిస్(34) కాస్త పర్వాలేదనిపించాడు. ఐడెన్ మార్క్‌రమ్(18), క్వింటన్ డికాక్(10), ర్యాన్ రికెల్టన్(0), డేవిడ్ మిల్లర్(6), బాష్(2), రబాడా(0) తీవ్రంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 2, కోంచీ 2, రచిన్ రవీంద్ర 2, ఫెర్గుసన్, నీషమ్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్‌లో సంచలన రికార్డ్!

ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ పోరు

Updated Date - Mar 04 , 2026 | 10:08 PM