Share News

టీ20 ప్రపంచ కప్ 2026: సెమీస్‌కు మ్యాచ్ రెఫరీలు వీరే!

ABN , Publish Date - Mar 03 , 2026 | 02:52 PM

టీ20 ప్రపంచ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. మార్చి 4, 5 తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లకు సంబంధించి మ్యాచ్ రెఫరీలు, అంపైర్లుగా ఎవరు వ్యవహరించనున్నారో తాజాగా ఐసీసీ వెల్లడించింది.

టీ20 ప్రపంచ కప్ 2026: సెమీస్‌కు మ్యాచ్ రెఫరీలు వీరే!
ICC Men's T20 World Cup

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే సూపర్ 8 దశ నుంచి నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి. మార్చి 4, 5 తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4(బుధవారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మార్చి 5(గురువారం) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్-భారత్ పోటీ పడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లకు సంబంధించి మ్యాచ్ రెఫరీలు, అంపైర్లుగా ఎవరు వ్యవహరించనున్నారో తాజాగా ఐసీసీ వెల్లడించింది. జవగల్ శ్రీనాథ్, ఆండీ పైక్రాఫ్ట్‌లను మ్యాచ్‌లకు రెఫరీలుగా నియమించింది.


ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌కు శ్రీనాథ్ రెఫరీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ వ్యవహరించనున్నారు నితిన్ మీనన్ థర్డ్ అంపైర్, రాడ్ టక్కర్ నాలుగో అంపైర్‌గా నియమితులయ్యారు. ముంబైలోని వాంఖడే స్డేడియం వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్‌కు పైక్రాఫ్ట్ రెఫరీగా వ్యవహరించనున్నారు. క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్ పాలేకర్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వహించనున్నారు. ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్ థర్డ్ అంపైర్, పాల్ రీఫెల్ ఫోర్త్ అంపైర్‌గా వ్యవహరించనున్నారు.


ఇవి కూడా చదవండి:

టీ20 డబ్ల్యూసీలో ఇప్పటికీ భారత్ ఫేవరెట్ కాదు: పాక్ మాజీ పేసర్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు హీరోకు ఘోర అవమానం

Updated Date - Mar 03 , 2026 | 02:52 PM