భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్, జింబాంబ్వే క్రికెట్ జట్లు
ABN , Publish Date - Mar 03 , 2026 | 01:33 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భారత్ చేతిలో వెస్టిండీస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరాజయంతో విండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో స్వదేశానికి బయల్దేరాల్సి ఉంది. అయితే అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా వారి ప్రయాణం మరింత ఆలస్యం కానుంది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భారత్ చేతిలో వెస్టిండీస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరాజయంతో విండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో స్వదేశానికి బయల్దేరాల్సి ఉంది. అయితే అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా వారి ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆటగాళ్ల ప్రయాణ భద్రత కోసం తాము ఐసీసీ (ICC), సంబంధిత ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్(West Indies Cricket Board) ప్రకటించింది.
'గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రయాణ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో అనేక అంతర్జాతీయ విమాన మార్గాలు ప్రభావితమయ్యాయి. భద్రత కారణాల దృష్ట్యా విమాన సంస్థలు ముందుగా షెడ్యూలు చేసిన సర్వీసులను రద్దు చేశాయి. స్వదేశానికి ఆలస్యంగా చేరుకున్న.. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యం' అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. అలానే జింబాంబ్వే క్రికెట్ బోర్డుకు(Zimbabwe cricket) కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.' మా క్రికెట్ జట్టు దుబాయ్ ద్వారా స్వదేశానికి తిరిగి రావాల్సిఉంది. కానీ పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా మా జట్టు ఆటగాళ్ల ప్రయాణ ప్రణాళికలు ప్రభావితమయ్యాయి’ అని తెలిపింది.
ప్రస్తుతం.. జింబాంబ్వే క్రికెట్ జట్టు ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. వెస్టిండీస్, జింబాంబ్వే జట్లు పశ్చిమాసియా ప్రాంతమైన దుబాయ్ మీదుగా తమ దేశాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఇరాన్ ప్రతిదాడి వల్ల దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. టీ20 ప్రపంచ కప్ 2026లో తమ చివరి మ్యాచ్ జింబాంబ్వే.. సౌతాఫ్రికా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీలో ఇప్పటికీ భారత్ ఫేవరెట్ కాదు: పాక్ మాజీ పేసర్
పాకిస్థాన్ క్రికెట్ జట్టు హీరోకు ఘోర అవమానం