Home » T20 WORLD CUP
PM Modi with Teamindia: వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించి టైటిల్ విన్నర్‌గా నిలిచిన టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. క్రికెట్ అభిమానులు క్రికెటర్లను చూసేందుకు ముంబైలో పొటెత్తారు. అంతకుముందు గురువారం ఉదయం ఢిల్లీలో ప్రధాని మోదీని భారత క్రికెటర్లు కలిశారు.
T20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకోవడంతో భారత జట్టు T20I ఫార్మాట్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా T20I నుంచి రిటైర్ అయ్యాక, భారత్ ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో జింబాబ్వేతో తన మొదటి అసైన్‌మెంట్‌ను ప్రారంభించనుంది.
విశ్వవిజేతలు అడుగుపెట్టిన ఆ క్షణంలో మైదానమంతా పులకించిపోయింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు స్పందించాయి. కొన్ని గంటల పాటు ముంబయి నగరం జన సునామీని తలపించింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది.
టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వాతావరణ పరిస్థితుల కారణంగా టీమిండియా క్రికెట్ టీమ్ కరేబీయన్ దీవుల్లోనే ఉండిపోయింది. బార్బొడాస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి.. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ముద్దాడింది.
టీమిండియా తరఫున దాదాపు 15 ఏళ్ల పాటు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్ కెరీర్లో చేదు జ్ఞాపకం 2007 ప్రపంచకప్. వెస్టిండీస్‌లో జరిగిన ఆ ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని టీమిండియా గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది.
క్రికెట్ ప్రపంచకప్ లేదా ఏదైనా అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో తరచూ వివాదాలు చూస్తుంటాం. అంపైర్ల నిర్ణయాలపైన లేదా ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తుంటాయి.
టీ20 ప్రపంచకప్ సాధించి ఎంతో మంది భారతీయుల కలలు నెరవేర్చిన టీమిండియాపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు మాత్రమే కాకుండా సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు కూడా సోషల్ మీడియా ద్వారా రోహిత్ సేనను అభినందిస్తున్నారు.
దాదాపు 11 ఏళ్ల తర్వాత టీమిండియా ఓ ఐసీసీ టైటిల్ సాధించడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. మైదానంలో ఆటగాళ్లను మించిన ఆనందాన్ని అనుభవించింది. మాజీ క్రికెటర్లు, అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా ఖాతాలోకి మరో ప్రపంచకప్ చేరింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు మరో మెగా టోర్నీలో టైటిల్ విన్నర్‌గా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్-2024ను చేజిక్కించుకుంది. బార్బొడాస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి కప్పు గెలిచింది.
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం కోట్లాది మందిని భావోద్వేగానికి గురి చేసింది. చివరి వరకు పట్టు వదలకుండా పోరాడిన టీమిండియాపై అభిమానులు, మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.