Home » Sunday
ఆ రాశి వారికి ఈ వారం ఖర్చులు విపరీతంగా ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. లావాదేవీలపై శ్రద్ధ పెట్టాలని, తొందరపాటు నిర్ణయం నష్టం కలిగిస్తుందని తెలుపుతున్నారు. గ్రహస్థితి సామాన్యమని, ఆచి తూచి అడుగేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇంకా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
అప్పుడెప్పుడో శ్రీదేవి ‘అతిలోక సుందరి’గా అలరిస్తే, ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’గా పలకరిస్తోంది. ఒకవైపు బాలీవుడ్ సినిమాలతో పాటు, టాలీవుడ్‌లో కూడా స్టార్‌హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటోంది.
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు.
కోరిన కోర్కెలు తీర్చి సకల విఘ్నాలు తొలగించే వినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి గ్రామంలో శ్రీసిద్ధి వినాయకుడిగా కొలువుదీరాడు. కృతయుగంలో దక్షప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు ముందుగా అయినవిల్లి గణపతినే కొలిచాడని ప్రతీతి. ఈ స్వామిని స్వయంభువుగా చెబుతారు.
మన దేవతలలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు.
శ్రీ మన్మహారాజ రాజేశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్ దేలియాడంగనిన్ జేరి యర్చించు భక్తావళిన్ సర్వవిఘ్న ప్రకాండంబులన్ రూపుమాయించి నానా వరంబుల్ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించుచున్నట్టి యో
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రస్యం దన్మథులుబ్ధ మధుపవ్యాలోల గండస్థలమ్
టెక్నాలజీ అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. సంగీత ప్రపంచంలో ఇటీవల ‘హోలోగ్రామ్’ కాన్సర్ట్ ట్రెండ్ ఊపందుకుంది. ఈ ప్రక్రియలో ఎప్పుడో భౌతికంగా దూరమైన అభిమాన గాయనీ గాయకులు డిజిటల్‌గా స్టేజీ మీద కనిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు.
ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుందని, అయితే.. అపరిచితులను ఓ కంట కనిపెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే శుభకార్యానికి హాజరవుతారని, స్నేహసంబంధాలు బలపడతాయని, ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదని సూచిస్తున్నారు.
ఇది నిజమేనా? అనే ప్రశ్న వస్తుంది ఈ ఫొటోలు చూస్తే... ముత్యాల్లా మెరిసే ఇసుక రేణువుల మధ్య, అందంగా పేర్చినట్టు నీటి మడుగులు. అందులో నీలం, ఆకుపచ్చ రంగుల కలబోత. ఒక అద్భుత కళాచిత్రంగా అనిపించే ఈ దృశ్యం ఈజిప్టులోని ‘సివా’ ఉప్పు నీటి సరస్సులున్న ప్రాంతం.