నిమ్మకాయ చారు.. ఇలా చేస్తే ఆ రుచే వేరుగా..
ABN , Publish Date - Apr 26 , 2026 | 01:07 PM
నిమ్మకాయ చారు.. కావలసిన పదార్థాలు: కంది పప్పు - కప్పు, టమాటా ముక్కలు - నాలుగు స్పూన్లు, పచ్చి మిర్చి - అయిదు,
కావలసిన పదార్థాలు: కంది పప్పు - కప్పు, టమాటా ముక్కలు - నాలుగు స్పూన్లు, పచ్చి మిర్చి - అయిదు, అల్లం తురుము - కొంచెం, కరివేపాకు రెబ్బలు - కొన్ని, పసుపు - అర స్పూను, ఉప్పు - స్పూను, నూనె - స్పూను, కొత్తిమీర తరుగు - కొంచెం, పోపు గింజలు - కొన్ని, ఇంగువ- కాస్త, ఎండు మిర్చి - రెండు, నీళ్లు, నిమ్మరసం - తగినంత.
తయారుచేసే విధానం: ప్రెషర్ కుక్కర్‌లో కంది పప్పు, టమాటా, పచ్చి మిర్చి, అల్లం, కరివేపాకు, పసుపు, ఉప్పు, నూనె, మూడు కప్పుల నీళ్లు వేసి అయిదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తరవాత మూత తీసి గరిటెతో పప్పును మెత్తగా చేసుకుని మరో మూడు కప్పుల నీళ్లు పోసి అయిదు నిమిషాలు ఉడికించాలి. పోపు పెట్టాక కొత్తి మీర తరుగు, నిమ్మరసం కలిపితే నిమ్మకాయ చారు రెడీ.
ఈ వార్తలు కూడా చదవండి:
సమ్మర్ టూర్‌కు సిద్ధమవుతున్నారా?
Read Latest Telangana News and National News