మీ చిన్న పొరపాట్లు ఎముకలను బలహీనపరుస్తాయి.. జాగ్రత్త!
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:18 PM
మన రోజువారీ జీవనశైలిలో చేసే కొన్ని చిన్న పొరపాట్లు కూడా ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా కాల్షియం లోపం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు ఎముకలను క్రమంగా బలహీనపరుస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: మన రోజువారీ జీవితంలో చేసే కొన్ని చిన్న తప్పులు కూడా ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది. కాల్షియం మన ఎముకలు, పళ్లు బలంగా ఉండటానికి మాత్రమే కాకుండా, కండరాలు, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి కూడా అవసరం.
ఎముకలకు హానికరమైన ఆహారాలు:
శీతల పానీయాలను ఎక్కువగా తాగితే శరీరంలో కాల్షియం తగ్గుతుంది. ఇవి కాల్షియం శోషణను అడ్డుకుంటాయి.
ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసాన్ని అధికంగా తింటే కాల్షియం శోషణ తగ్గి ఎముకలు బలహీనపడతాయి.
బేకరీ పదార్థాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇవి ఎముకల ఆరోగ్యానికి హానికరం.
టీ, కాఫీలలోని కెఫీన్ కాల్షియం శోషణను తగ్గిస్తుంది. ఎక్కువగా తాగితే ఎముకలు బలహీనమవుతాయి.
మద్యం ఎక్కువగా తాగితే ఎముకల బలం తగ్గి విరిగే ప్రమాదం పెరుగుతుంది.
ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తింటే శరీరంలో వాపు పెరిగి, కాల్షియం శోషణ తగ్గుతుంది.
ఎముకలకు మేలు చేసే ఆహారం:
పాలు, పెరుగు
ఆకుకూరలు
తాజా పండ్లు
కోడి గుడ్డు
నట్స్
జాగ్రత్తలు
రోజూ కొంత వ్యాయామం చేయాలి.
ఉదయం, సాయంత్రం ఎండలో కాసేపు ఉండాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
ఎముకలు బలంగా ఉండాలంటే సరైన ఆహారం, మంచి అలవాట్లు చాలా ముఖ్యం. చిన్న పొరపాట్లను సరిచేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News