ట్రంప్ కార్యక్రమం సందర్భంగా కాల్పులు.. అదే హోటల్‌లో కేఏ పాల్..
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:11 PM
కాల్పులు జరిగిన సమయంలో హిల్టన్ హోటల్‌లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. హోటల్ నుంచి ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: వాషింగ్టన్ డీసీలో హిల్టన్ హోటల్‌లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన యాన్యువల్ ప్రెస్ డిన్నర్ సందర్భంగా కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలనియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు అమెరికా కీలక నేతలు పాల్గొన్నారు. ఓ వ్యక్తి గన్నుతో హిల్టన్ హోటల్‌లోకి చొరబడ్డాడు. డిన్నర్ జరుగుతున్న బాల్‌రూమ్ బయట కాల్పులకు తెగబడ్డాడు. భద్రతా దళాలు, పోలీసులు అతడిని పట్టుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
అదే హోటల్‌లో కేఏ పాల్..
కాల్పులు జరిగిన సమయంలో హిల్టన్ హోటల్‌లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. హోటల్ నుంచి ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘వాషింగ్టన్ డీసీ, హిల్టన్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. గంట, రెండు గంటల క్రితం ప్రెసిడెంట్ ట్రంప్‌ను ఓ షూటర్ షూట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ హోటల్‌కు చాలా సెక్యూరిటీ ఉంటుంది’..
‘37 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. నేను రెగ్యులర్‌గా పీస్ టాక్స్‌లో ఉన్నాను. ప్రజలందరినీ కలుస్తున్నాను. లోపలికి ఎవరు రావాలన్నా సెక్యూరిటీ చెకింగ్స్ ద్వారానే రావాలి. అమెరికా అధ్యక్షుడు లోపల ఉండగా షూటర్ ఎలా వచ్చాడు. కాల్పుల్లో ఎవరికీ ఏ హానీ జరగలేదు. ప్రపంచంలో శాంతి కరవైంది. యుద్ధాలు ఎక్కువై పోయాయి’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
సమ్మర్ టూర్‌కు సిద్ధమవుతున్నారా?
నిమ్మరసం రాస్తే జుట్టు తెల్లబడుతుందా?