Home » Student
తెలంగాణలో నిర్వహించనున్న టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా మే 28వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షను జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. నేడు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఫలితాలను విడుదల చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ పరీక్షలకు సంబంధించిన ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో 580కి పైగా మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించేందుకు చర్యలు ప్రారంభించారు.
మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని పూజారెడ్డి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటూ ఏలూరు జిల్లాలోని పెదపాడు పాఠశాలకు కొత్త భవనం నిర్మించారు. ‘అడవితల్లి బాట’ కార్యక్రమ ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన మాట మేరకు పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయించారు.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువును మే 13 వరకు పొడిగించింది.
తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలబట్టడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
జిల్లాలో ఈనెల 21 నుంచి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో కె.హేమలత ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
రాష్ట్ర విద్యాశాఖలోని విప్లవాత్మక మార్పుల ప్రభావం.. తాజా పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గ్లోబల్ స్థాయిలో పోటీ పడే సత్తాను సాధించారని ప్రశంసించారు.