Share News

Jammu Kashmir: నిషేధిత పాఠశాలలను ఆధీనంలోకి తీసుకున్న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం

ABN , Publish Date - Aug 23 , 2025 | 07:40 AM

జమాత్ పై నిషేధం తర్వాత దాదాపు 300 పాఠశాలలు దర్యాప్తు పరిధిలోకి వచ్చాయని మంత్రి సకినా ఇటూ తెలిపారు. నిఘా సంస్థల దర్యాప్తు ఆధారంగా, 50 పాఠశాలలకు క్లీన్ చిట్ ఇవ్వబడిందని పేర్కొన్నారు. అయితే, 215 పాఠశాలల నిర్వహణ కమిటీలపై ప్రతికూల నివేదికలు వచ్చాయని చెప్పుకొచ్చారు.

Jammu Kashmir: నిషేధిత పాఠశాలలను ఆధీనంలోకి తీసుకున్న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో నిషేధిత జమాతే ఇస్లామీతో.. సంబంధం ఉన్న 215 పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. 2019లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జమాత్‌ను నిషేధించిన తర్వాత పాఠశాల నిర్వహణ కమిటీలు లేకపోవడంతో ఈ పాఠశాలలు రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. దీంతో వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఆ విద్యార్థుల విద్యను కాపాడాటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పాఠశాలల నిర్వహణను జిల్లా న్యాయాధికారులుకు అప్పగింస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా అనుమతి తెలిపారని విద్యాశాఖ మంత్రి సకినా ఇటూ అన్నారు.


జమాత్ పై నిషేధం తర్వాత దాదాపు 300 పాఠశాలలు దర్యాప్తు పరిధిలోకి వచ్చాయని మంత్రి సకినా ఇటూ తెలిపారు. నిఘా సంస్థల దర్యాప్తు ఆధారంగా, 50 పాఠశాలలకు క్లీన్ చిట్ ఇవ్వబడిందని పేర్కొన్నారు. అయితే, 215 పాఠశాలల నిర్వహణ కమిటీలపై ప్రతికూల నివేదికలు వచ్చాయని చెప్పుకొచ్చారు. నిషేధిత సంస్థ జమాత్-ఎ-ఇస్లామి/ఫలాహ్-ఎ-ఆమ్ ట్రస్ట్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుబంధంగా ఉన్న అనేక పాఠశాలలను నిఘా సంస్థలు గుర్తించాయని చెప్పారు. అలాంటి 215 పాఠశాలల మేనేజింగ్ కమిటీ చెల్లుబాటు గడువు ముగిసిందని వివరించారు.


215 పాఠశాలల మేనేజింగ్ కమిటీని సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్/ డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకుంటారని మంత్రి సకినా ఇటూ పేర్కొన్నారు. వీటిని సక్రమంగా ధృవీకరించిన తర్వాత సంబంధిత పాఠశాలలకు తగిన సమయంలో కొత్త మేనేజింగ్ కమిటీని ప్రతిపాదిస్తారని తెలిపారు. ఈ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల విద్యా వృత్తిపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా పాఠశాల విద్యా శాఖతో సంప్రదించి, సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పాఠశాలల్లో NEP నిబంధనల ప్రకారం నాణ్యమైన విద్యను అందించడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు.


ఇవి కూడా చదవండి..

చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు

వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

Updated Date - Aug 23 , 2025 | 08:06 AM