Share News

Hyderabad: బడికి పోదామంటే భయం.. భయం..

ABN , Publish Date - Aug 30 , 2025 | 08:03 AM

బడికి వెళదామంటే కుక్కల భయం, దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. అడ్డగుట్టలోని ప్రభుత్వ స్కూలు ఎదురుగా గుంపులు గుంపులుగా ఉన్న కుక్కలు రోడ్లపైనే కాపు కాస్తున్నాయి. బడికి వచ్చే విద్యార్థులను కరుస్తుండడంతో భయానక పరిస్థితి ఏర్పడింది.

 Hyderabad: బడికి పోదామంటే భయం.. భయం..

- స్కూలు పిల్లల వెంటపడుతున్న కుక్కలు

- అడ్డగుట్టలో బడికి దూరమవుతున్న విద్యార్థులు

హైదరాబాద్: బడికి వెళదామంటే కుక్కల భయం, దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. అడ్డగుట్టలోని ప్రభుత్వ స్కూలు ఎదురుగా గుంపులు గుంపులుగా ఉన్న కుక్కలు రోడ్లపైనే కాపు కాస్తున్నాయి. బడికి వచ్చే విద్యార్థులను కరుస్తుండడంతో భయానక పరిస్థితి ఏర్పడింది. కుక్కల్ని పట్టుకెళ్లేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎవరూ రావడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఫోన్‌ ద్వారా సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడంలేదు.


అడ్డగట్ట ప్రభుత్వ స్కూలు ఎదురుగా మారేడుపల్లి(Maredupalli) తహసిల్దార్‌ కార్యాలయం, శాస్త్రినగర్‌ లంబాడిబస్తీలో కుక్కల బెడద కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి అయిందంటే చాలు.. ఈ ప్రాంతంలో కుక్కల భయంతో పిల్లలు బయటికి వెళ్లలేని పరిస్థితి. రోడ్డుపైనే వచ్చిపోయే వాళ్లను కరుస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది కుక్కలను పట్టేందుకు నెల రోజుల క్రితం వీధుల్లోకి వచ్చి కుక్కలు ఎక్కడా లేవని తిరిగి వెళ్లిపోయారు.


city5.jpg

కొందరు పిల్లలైతే బడికి పంపించకకుండా ఇంటి వద్దే ఉంచూతు తల్లిదండ్రులు పనికి వెళ్లిపోతున్నారు. కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు తీసుకోవాలని, అవి కరిస్తే చనిపోతున్నారంటూ చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. శాస్త్రీనగర్‌లో ఆరేళ్ల బాలుడు, ప్రభుత్వ స్కూలు ముందు ఆరవ తరగతి చదువుతున్న బాలు డు, లంబాడిబస్తీలో ఓ వృద్ధుడిని కుక్క కాటు వేయడంతో ఆస్పత్రి పాలయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 30 , 2025 | 08:03 AM