Home » Student
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి చట్టం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు బండి సంజయ్ .
ఉన్నత విద్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి లోకేష్.
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది అక్షయ పాత్ర ఫౌండేషన్. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డిని అక్షయ పాత్ర పౌండేషన్ ప్రతినిధులు సోమవారం కలిశారు.
వచ్చే నెల 26న జరిగే మాక్ అసెంబ్లీకి మంత్రాలయం నియోజకవర్గం తరపున పెద్దకడబూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు.
మొంథా తుఫాను ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో గురువారం పాఠశాలలకు, అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రకటించారు. మొంథా తుఫాను నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు.
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలనూ మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయానికి దీపావళి సెలవులు రావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు.
పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకి సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఓ కమిటీని నియమించింది.
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించినందుకు ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్పేట పీఎస్ పరిధిలో జరిగింది.