Share News

Indian Student: దారుణం.. కెనడాలో తెలుగు విద్యార్థిని కాల్చిన దుండగులు.. స్పాట్ డెడ్

ABN , Publish Date - Dec 26 , 2025 | 10:55 AM

విదేశాల్లో ఉన్నత చదువు అభ్యసించి మంచి ఉద్యోగం చేసి సంపాదించుకోవాలన్న ఆశతో వెళ్లిన విద్యార్థులపై కొంతమంది సైకోలు, సంఘవిద్రోహులు దారుణంగా హతమార్చుతున్నారు. కెనడాలో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు జరిపారు.

Indian Student: దారుణం.. కెనడాలో తెలుగు విద్యార్థిని కాల్చిన దుండగులు.. స్పాట్ డెడ్
Indian Student Killed in Canada

కెనడా(Canada)లో టొరంటో విశ్వవిద్యాలయాని (University of Toronto)కి చెందిన స్కార్‌బరో క్యాంపస్ (UTSC) సమీపంలో భారతీయ విద్యార్థి (Indian student)పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు(shooting) జరిపారు. ఈ సంఘటన డిసెంబర్ 23 న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. మరణించిన యువకుడు శివంక్ అవస్థి(20)గా పోలీసులు గుర్తించారు. శివంక్ అవస్థి హత్యపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India) విచారం వ్యక్తం చేశారు.


‘టొరంటో విశ్వవిద్యాలయం స్కార్‌బరో క్యాంపస్’ సమీపంలో జరిగిన కాల్పుల సంఘటనలో యువ భారతీయ డాక్టరేట్ విద్యార్థి శివంక్ అవస్థి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కాన్సులేట్ తరుపున ప్రగాఢ సానుభూతి. కుటుంబ సభ్యులకు ఎలాంటి అవసరం ఉన్నా ఇక్కడి అధికారులు మీతో సమన్వయం అవుతారు.. సహాయాన్ని అందిస్తారు’ అంటూ..‘X’ లో పోస్ట్ చేసింది. శివంక్ కు టొరంటో విశ్వవిద్యాలయ స్కార్‌బరో చీర్ లిడింగ్ బృంద సభ్యులు, ఇన్‌స్ట్రాగ్రాం పోస్టులో నివాళులర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహానగరంలో మత్తు మూకలు!

ప్రతి దరఖాస్తుకూ జవాబుదారీ

Read Latest International News and Telangana News

Updated Date - Dec 26 , 2025 | 11:17 AM