Home » Stock Market
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ప్రస్తుతం కోలుకుంటున్నాయి. బుధవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం నష్టాలతోనే రోజును ముగించింది.
రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్టానికి పడిపోవడం, అంతర్జాతీయంగా సానుకూలాంశాలు స్టాక్‌మార్కెట్లను ముందుకు నడిపించాయి. ఈ వారంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ట్రంప్ కలవబోతుండడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడం మదుపర్లలో జోష్‌ను నింపింది.
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. గత వారం వరుస నష్టాలతో 80 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ ఈ రోజు మళ్లీ కోలుకుంది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్క్‌ను దాటింది.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో వచ్చే వారం మరింత కొత్త ఉత్సాహం కనిపించనుంది. ఈ వారం 4 కొత్త ఐపీఓలు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీంతోపాటు 10కిపైగా కంపెనీలు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 9న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
దేశీయ స్టాక్ మార్కెట్లలో నిన్న లాభాలతో సంబరపడిన ఇన్వెస్టర్లు, ఈరోజు (ఆగస్టు 8, 2025) ఊహించని నష్టాల భారం మోస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మార్కెట్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి.
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 సుంకాలను విధించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలను కొనసాగిస్తున్నాయి. ట్రంప్ బెదిరింపుల కారణంగా అంతర్జాతీయంగా కూడా మిశ్రమ సంకేతాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా నష్టాలతో మొదలయ్యాయి.
అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 7న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. భారత్‌పై మరింతగా సుంకాలను పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు దిగారు. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి.
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 5న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..