Multibagger 2025: లక్ష పెడితే రూ. 15 లక్షల లాభం.. ఎలా అంటే!
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:39 PM
ఆకర్షణీయమైన స్టాక్స్‌లో ఒకటైన ఇండస్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ ఇటీవల పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచే రాబడులను అందించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీగా కొనుగోళ్లు పెరగడంతో, ఈ షేరు గత ఐదేళ్లలో ఏకంగా 1400 శాతం వరకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.
బిజినెస్ న్యూస్: ప్రతి ఒక్కరికి ఆర్థికంగా బాగా స్థిర పడాలనే కోరిక ఉంటుంది. ఈ క్రమంలో వివిధ మార్గాల్లో పెట్టుబడులు(Investing Tips) పెట్టి.. అధిక లాభాలు పొందే ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాక బాగా ఆదాయం వచ్చే ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తుంటారు. అలాంటి వాటిల్లో పెన్నీ స్టాక్స్ ఒకటి. ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంటుంది. సరిగ్గా అంచనా వేయగలిగితే, ఇవి అతి తక్కువ కాలంలో అపారమైన లాభాలను అందిస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఆకర్షణీయమైన స్టాక్స్‌లో ఒకటైన ఇండస్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ (Indus Trade Links Ltd) ఇటీవల పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచే రాబడులను అందించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FIIs) నుంచి భారీగా కొనుగోళ్లు పెరగడంతో, ఈ షేరు గత ఐదేళ్లలో ఏకంగా 1400 శాతం వరకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. సాధారణంగా పెన్నీ స్టాక్స్‌లో సంస్థాగత ఇన్వెస్టర్ల భాగస్వామ్యం తక్కువగా ఉంటుంది. అయితే, ఇండస్ ట్రేడ్ లింక్స్ షేర్లలో మాత్రం FIIల ఆసక్తి ఇటీవల బాగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
తాజా షేర్‌హోల్డింగ్ నమూనాల ప్రకారం.. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(Foreign Institutional Investors) ఈ కంపెనీలో తమ వాటాను క్రమంగా పెంచుకుంటూ వచ్చారు. మార్చి 2025 త్రైమాసికాల్లో 0.04% ఉన్న FII వాటా, సెప్టెంబర్ 2025 త్రైమాసికం నాటికి 2.93% పెరిగింది.
FIIల కొనుగోళ్ల కారణంగా ఈ షేరుకు డిమాండ్ పెరిగి, దాని ధర కూడా అనూహ్యంగా పెరిగిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇండస్ ట్రేడ్ లింక్స్ షేర్ గత 5 సంవత్సరాల్లో సుమారు 1400% రాబడి ఇవ్వగా, ఏడాదిలో సుమారు 66.26% రాబడినిచ్చింది. అంటే ఐదేళ్ల క్రితం ఈ షేరులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి, నేడు ఆ పెట్టుబడి విలువ దాదాపు రూ. 15 లక్షలుగా మారిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇందులో పన్నులు, ఇతర ఛార్జీలు మినహాయింపు ఉంటుంది. ఇండస్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్(Indus Trade Links) అనేది కేవలం ఒకే రంగంలో కాకుండా, రవాణా, మీడియా, పెట్టుబడి, కోల్ మైనింగ్, వంటి వివిధ రంగాలలో వ్యాపారం చేసే ఒక విభిన్నమైన (Diversified)సంస్థ.
ఇక్కడ ఓ చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పెన్నీ స్టాక్స్(Penny Stocks) అధిక రాబడిని అందించే అవకాశం ఉన్నప్పటికీ, వీటిలో ఎక్కువగా రిస్క్ ఉంటుంది. కంపెనీ పనితీరు, ఆర్థిక స్థితి, మార్కెట్ పరిస్థితులలో వచ్చే చిన్న మార్పులు కూడా ఈ స్టాక్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పెట్టుబడిదారులు, ముఖ్యంగా పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
ఇవీ చదవండి:
Investors Wealth: రూ 2 లక్షల 71 కోట్ల సంపద నష్టం
మార్కెట్లో హ్యుండయ్ సరికొత్త వెన్యూ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి