Share News

Stock Market: సూచీలకు భారీ లాభాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే

ABN , Publish Date - Oct 27 , 2025 | 04:18 PM

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. విదేశీ మదుపర్ల ఆసక్తి, మెటల్, గ్యాస్, ఆయిల్ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. దీంతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి.

Stock Market: సూచీలకు భారీ లాభాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే
Stock Market

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. విదేశీ మదుపర్ల ఆసక్తి, మెటల్, గ్యాస్, ఆయిల్ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. దీంతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను పరుగులు పెట్టించడంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (84, 211)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 80 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా లాభపడి 84, 932 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 566 పాయింట్ల లాభంతో 84, 778 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 170 పాయింట్ల లాభంతో 25, 966 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోఫోర్జ్, బీపీసీఎల్, పీబీ ఫిన్‌టెక్, వోడాఫోన్ ఐడియా మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఎస్బీఐ కార్డ్, బ్రిటానియా, ఎస్‌ఆర్‌ఎఫ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, దివీస్ ల్యాబ్స్ మొదలైన షేర్లు నష్టాలలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 548 పాయింట్ల లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 414 పాయింట్ల లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.25గా ఉంది.


ఇవీ చదవండి:

బులియన్‌ మార్కెట్లో అనిశ్చితి

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 04:18 PM