Stock Market: సూచీలకు స్వల్ప లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:59 PM
సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ కోలుకున్నాయి. కంపెనీలు వెలువరిస్తున్న త్రైమాసిక ఫలితాలు కూడా మదుపర్లలో విశ్వాసం నింపాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలను నష్టాల నుంచి లాభాల వైపు నడిపించాయి.
సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ కోలుకున్నాయి. కంపెనీలు వెలువరిస్తున్న త్రైమాసిక ఫలితాలు కూడా మదుపర్లలో విశ్వాసం నింపాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలను నష్టాల నుంచి లాభాల వైపు నడిపించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో రోజును ముగించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (83, 938)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు కోల్పోయి 83, 609 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అయితే ఆ తర్వాత రియాల్టీ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. మధ్యాహ్నం తర్వాత సూచీలు కోలుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 39 పాయింట్ల స్వల్ప లాభంతో 83, 978 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 41 పాయింట్ల లాభంతో 25, 763 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్‌లో వొడాఫోన్ ఐడియా, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌ఎఫ్‌సీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గోద్రేజ్ కన్స్యూమర్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). పతంజలి ఫుడ్స్, మారుతీ సుజుకీ, పేటీఎమ్, కోల్గేట్, అదానీ గ్రీన్ ఎనర్జీ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 461 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 325 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.78గా ఉంది.
ఇవీ చదవండి:
ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త
India Auto Industry: వాహన విక్రయాల్లో రికార్డు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి