Share News

India Auto Industry: వాహన విక్రయాల్లో రికార్డు

ABN , Publish Date - Nov 02 , 2025 | 02:49 AM

ఈ పండగ సీజన్‌లో ప్యాసింజర్‌ వాహన కంపెనీలకు భారీ లాభాల పంట పండింది. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీ ఇండియాతో పాటు...

India Auto Industry: వాహన విక్రయాల్లో రికార్డు

జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో అక్టోబరులో పోటెత్తిన అమ్మకాలు

న్యూఢిల్లీ: ఈ పండగ సీజన్‌లో ప్యాసింజర్‌ వాహన కంపెనీలకు భారీ లాభాల పంట పండింది. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీ ఇండియాతో పాటు మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌, కియా ఇండియా గత నెలలో రికార్డు స్థాయి దేశీయ విక్రయాలను నమోదు చేశాయి. స్కోడా ఆటో ఇండియా, టయోటా కిర్లోస్కర్‌ సేల్స్‌ కూడా భారీగా పెరిగాయి. దసరా నవరాత్రుల తొలి రోజు (సెప్టెంబరు 22) నుంచి తగ్గించిన జీఎ్‌సటీ రేట్లు అమల్లోకి రావడంతో పండగ సీజన్‌లో కస్టమర్ల కొనుగోళ్లు పోటెత్తడం ఇందుకు దోహదపడింది. అక్టోబరులో కంపెనీ 2,42,096 యూనిట్ల రిటైల్‌ విక్రయాలు జరిపిందని, 2024 అక్టోబరుతో పోలిస్తే సేల్స్‌ 20 శాతం పెరిగాయని మారుతి సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) పార్థో బెనర్జీ తెలిపారు. ఇది కంపెనీ చరిత్రలో అత్యధిక నెలవారీ విక్రయాలని అన్నారు. నవరాత్రుల తొలి రోజు మొదలుకొని 40 రోజుల పండగ సీజన్‌లో కంపెనీకి 5 లక్షల కార్ల బుకింగ్స్‌ లభించాయని, రిటైల్‌ సేల్స్‌ 4.1 లక్షల యూనిట్లు గా నమోదైనట్లు బెనర్జీ వెల్లడించారు. మరిన్ని విషయాలు..

  • గత నెలలో మారుతి సుజుకీ దేశీయ టోకు విక్రయాలు (ప్యాసింజర్‌, కమర్షియల్‌ వాహనాలు) వార్షిక ప్రాతిపదికన 10.75 శాతం వృద్ధితో ఆల్‌టైం రికార్డు స్థాయి 1,80,675 యూనిట్లకు చేరా యి. అందులో ప్యాసింజర్‌ వాహనాల దేశీయ టోకు విక్రయాలు 10.48 శాతం పెరుగుదలతో 1,76,318 యూనిట్లుగా ఉన్నాయి.

  • మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎస్‌యూవీల టోకు విక్రయాలు 31 శాతం వృద్ధితో 71,624 యూనిట్లకు చేరాయి. కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక ఎస్‌యూవీ విక్రయాలు.

  • టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ లిమిటెడ్‌ టోకు విక్రయాలు 26.6 శాతం పెరుగుదలతో 61,295 యూనిట్లకు చేరాయి.

  • హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ దేశీయ విక్రయాలు మాత్రం వార్షిక ప్రాతిపదికన 3.2 శాతం తగ్గి 53,792 యూనిట్లకు పరిమితం అయ్యాయి. కియా ఇండియా విక్రయాలు 30 శాతం పెరిగి 29,556 యూనిట్లకు చేరాయి.


  • టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) టోకు అమ్మకాలు 39 శాతం పెరిగి 42,892 యూనిట్లకు చేరగా.. స్కోడా ఆటో రికార్డు స్థాయిలో 8,252 కార్లను విక్రయించింది. నిస్సాన్‌ మోటార్‌ దేశీయంగా 2,402 కార్లను విక్రయించింది. హోండా కార్స్‌ దేశీయ అమ్మకాలు 15.3 శాతం వృద్ధితో 6,934 యూనిట్లకు పెరిగాయి.

వాణిజ్య వాహనాలు: కమర్షిల్‌ వెహికిల్స్‌ విషయానికొస్తే, అశోక్‌ లేలాండ్‌ వాహనాల దేశీయ టోకు విక్రయాలు 16 శాతం పెరుగుదలతో 16,314 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటార్స్‌ దేశీయ టోకు అమ్మకాలు 7 శాతం వృద్ధితో 35,108 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 03:04 AM