Stock Market: సూచీలకు భారీ నష్టాలు.. కారణాలు ఇవే..
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:02 PM
సోమవారం స్వల్ప లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం 1,883 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది.
సోమవారం స్వల్ప లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం 1,883 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. గత నాలుగు సెషన్లలో విదేశీ మదుపర్లు 14, 269 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా సూచీల నష్టాలకు కారణంగా నిలిచాయి.
ఇక, కంపెనీలు వెలువరిస్తున్న త్రైమాసిక ఫలితాలు కూడా నెగిటివ్‌గా మారాయి. ఇన్ని రోజులు లాభాలు అందించిన మెటల్, ఆటో, బ్యాంకింగ్ సెక్టార్లలో లాభాల స్వీకరణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (83, 978)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం తర్వాత చివరి గంటలో ఆ నష్టాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 519 పాయింట్ల నష్టంతో 83, 459 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 165 పాయింట్ల నష్టంతో 25, 597 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్‌లో హిటాచీ ఎనర్జీ, డాబర్ ఇండియా, డెలివరీ, ఇండస్ టవర్స్, టైటాన్ కంపెనీ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). హీరో మోటోకార్ప్, సోలార్ ఇండస్ట్రీస్, ఎన్‌సీసీ, భారత్ డైనమిక్స్, సీడీఎస్‌ఎల్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 250 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 274 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.66గా ఉంది.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి