Share News

Stock Market: 26 సూచీలకు భారీ నష్టాలు.. 590 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ABN , Publish Date - Oct 30 , 2025 | 03:53 PM

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం లాభాలను ఆర్జించాయి. అంచనాలకు అనుగుణంగానే 25 శాతం వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించినప్పటికీ, ఈ ఏడాదిలో మరోసారి రేట్ల కోత ఉండదని ఛైర్మనె తేల్చి చెప్పడంతో మదుపర్లు కలవరానికి గురయ్యారు.

Stock Market: 26 సూచీలకు భారీ నష్టాలు.. 590 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
Stock Market

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం లాభాలను ఆర్జించాయి. అంచనాలకు అనుగుణంగానే 25 శాతం వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించినప్పటికీ, ఈ ఏడాదిలో మరోసారి రేట్ల కోత ఉండదని ఛైర్మనె తేల్చి చెప్పడంతో మదుపర్లు కలవరానికి గురయ్యారు. బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.2, 500 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం కూడా నెగిటివ్‌గా మారింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ గురువారం భారీ నష్టాలను నమోదు చేశాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (84, 997)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు కోల్పోయి 84, 312 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 592 పాయింట్ల నష్టంతో 84, 404 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 176 పాయింట్ల నష్టంతో 26, 877 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌లో పీబీ ఫిన్‌టెక్, భెల్, ఏబీ క్యాపిటల్, ఆయిల్ ఇండియా, కెనరా బ్యాంక్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). వోడాఫోన్ ఐడియా, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఈఎక్స్, హెచ్‌ఎఫ్‌సీఎల్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 52 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 354 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.69గా ఉంది.


ఇవి కూడా చదవండి..

Home Minister Amit Shah: పీఎం, సీఎం..రెండు పదవులూ ఖాళీ లేవు

Former Bangladesh PM Sheikh Hasina: భారత్‌లో స్వేచ్ఛగా ఉన్న..బంగ్లాదేశ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు

Updated Date - Oct 30 , 2025 | 05:25 PM