Stock Market: 26 వేల మార్క్ దాటిన నిఫ్టీ.. సూచీలకు భారీ లాభాలు..
ABN , Publish Date - Oct 23 , 2025 | 10:31 AM
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు, భారత్ ఎగుమతులపై అమెరికాలో సుంకాలు 50 నుంచి 15 శాతానికి దిగి వస్తాయనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు, భారత్ ఎగుమతులపై అమెరికాలో సుంకాలు 50 నుంచి 15 శాతానికి దిగి వస్తాయనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. దీంతో గురువారం దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను పరుగులు పెట్టిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతన్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 426)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 600 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కూడా అదే జోష్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఉదయం 10:20 గంటల సమయంలో సెన్సెక్స్ 750 పాయింట్ల లాభంతో 85, 176 వద్ద కొనసాగుతోంది. 85 వేల మార్క్‌ను దాటేసింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 212 పాయింట్ల లాభంతో 26, 080 వద్ద కొనసాగుతోంది. 26 వేల మార్క్‌కు పైన చలిస్తోంది (stock market news today).
సెన్సెక్స్‌లో భారత్ ఫోర్జ్, ఇన్ఫోసిస్, సోనా బీఎల్‌డబ్ల్యూ, ఎంఫసిస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). మనప్పురం ఫైనాన్స్, ఎన్‌ఎమ్‌డీసీ, డిక్సన్ టెక్నాలజీస్, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 379 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 518 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.89గా ఉంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
సత్య నాదెళ్ల వేతనం రూ.850 కోట్లు
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..