Stock Market: 26 వేలు దాటిన నిఫ్టీ.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:16 PM
సోమవారం నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం కోలుకున్నాయి. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచింది.
మంగళవారం నష్టాలను చవిచూసిన సూచీలు బుధవారం కోలుకున్నాయి. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచింది. దీనికి తోడు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, చైనా-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు ఉన్నాయని వార్తలు రావడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలను ఆర్జించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 628)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడి 85, 105 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 368 పాయింట్ల లాభంతో 84, 997 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 117 పాయింట్ల లాభంతో 26, 053 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ, వరుణ్ బేవరేజెస్, సెయిల్, ఐఓసీ, అదానీ ఎనర్జీ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, కేఫిన్ టెక్నాలజీస్, క్యామ్స్, బోష్, పీబీ ఫిన్‌టెక్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 383 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 171 పాయింట్ల లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.19గా ఉంది.
ఇవీ చదవండి:
2030 నాటికి రూ.35.32 లక్షల కోట్లు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి