Home » Sports
స్వదేశంలో వరుస టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్ కావడంతో ఒత్తిడిలో ఉన్న గౌతమ్ గంభీర్‌కు రవిశాస్త్రి కీలక హెచ్చరిక చేశాడు. పనితీరు బాగాలేకపోతే ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని.. పనిని ఆస్వాదించాలని సూచించాడు.
డిసెంబర్ 7న స్మృతి మంధాన పెళ్లి జరుగుతుందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె సోదరుడు శ్రావణ్ స్పష్టం చేశాడు. పెళ్లి ఇంకా వాయిదాలోనే ఉందని చెబుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు.
టీ20లతో పాటు వన్డే, టెస్టు ఫార్మాట్లలోనూ తనకు ఆడే సత్తా ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తెలిపాడు. విరాట్ కోహ్లీ సలహాలు తీసుకుంటూ తన ఆటను మెరుగుపర్చుకుంటానని వెల్లడించాడు.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ ఆకస్మికంగా కన్నుమూశారు. సోమవారం ఆయన నివాసంలో ప్రాణాలు విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందేనని సెలక్షన్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోనని చెప్పినట్లు సమాచారం.
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య పునరాగమనం చేశాడు. పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పాండ్య ఆల్‌రౌండ్ షోతో బరోడా జట్టు ఘన విజయం సాధించింది.
రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్టులో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించకపోవడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. బెంచ్‌కే పరిమితం చేయాలనుకున్నప్పుడు ఎందుకు ఎంపిక చేశారని సెలక్టర్లను ప్రశ్నించాడు.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు స్టార్ ప్లేయర్లు వీడ్కోలు పలుకుతున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేరాడు. ఈ ఏడాది వేలంలో తన పేరును రిజిస్టర్ చేయించుకోవద్దని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు.
గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక భారత్ వరుస ఓటములను చవి చూస్తుంది. సౌతాఫ్రికాతో టెస్టులో స్వదేశంలోనే వైట్ వాష్‌కు గురైంది. ఈ విషయంపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. తానే కోచ్‌గా ఉంటే ఓటమికి బాధ్యత తీసుకునేవాడినని తెలిపాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. పడిక్కల్ మెరుపు శతకం దెబ్బకు కర్ణాటక జట్టు 145 పరుగుల తేడాతో తమిళనాడుపై ఘన విజయం సాధించింది.