Home » Sports
ఐపీఎల్ 2027 మినీ వేలానికి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. వచ్చే సీజన్‌కు ముందు నిర్వహించే మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ దూకుడు ప్రదర్శించాడు. పాకిస్థాన్ బ్యాటర్ ఫర్హాన్‌ను వెనక్కి నెట్టి మళ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు.
యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో ఓటమిని జీర్ణించుకోలేక స్టార్ ప్లేయర్ అరీనా సబలెంకా ఆగ్రహానికి గురై కోర్టులోనే రాకెట్‌ను విరగ్గొట్టిన సంగతి తెలిసిందే. ఆమె ప్రవర్తనపై యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. 7,500 డాలర్ల జరిమానా విధించింది.
భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా అఫ్గానిస్థాన్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జపాన్ వేదికగా సెప్టెంబర్ 28 నుంచి జరగనున్న ఆసియా క్రీడలకూ వరుణ్ దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో అదరగొట్టిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. తనపై, వైభవ్ సూర్యవంశీపై జరుగుతున్న చర్చకు తెరదించాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న సంజూ.. సోషల్ మీడియాలో జరిగే చర్చలను తాను పెద్దగా పట్టించుకోనన్నాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన వన్డే రికార్డు బద్దలైంది. జింబాబ్వే వికెట్ కీపర్, బ్యాటర్ బ్రెండన్ టేలర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు రెండో టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
వెస్టిండీస్‌తో భారత్ స్వదేశంలో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. దీనికి టీమిండియా జట్ల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం జాతీయ సెలెక్షన్ కమిటీ రెండు ఫార్మాట్లకు జట్లను ఎంపిక చేయనుంది.
ఆసియా కప్‌లో 12 వికెట్లతో అదరగొట్టిన భారత యువ స్పిన్నర్ శ్రీచరణి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 800 రేటింగ్ పాయింట్ల మార్క్‌ను అందుకున్న తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.