Home » Sports news
వెటరన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఈక్రమంలో వరల్డ్ నెం.9 విక్టర్ లాయ్‌కి షాకిచ్చాడు. స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్/చిరాగ్ కూడా ముందంజ వేయగా..వర్ధమాన తార తన్వీశర్మ రెండో రౌండ్‌లో ఓటమి చవిచూసింది.
గాయపడిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్థానంలో యశ్‌వీర్ సింగ్‌ను ఆసియాడ్‌కు ఎంపిక చేశారు. జపాన్‌లో ఈ నెల 19 నుంచి జరిగే ఆసియా క్రీడలకు సంబంధించి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పాల్గొనే 77 మంది సభ్యుల బృందాన్ని భారత అథ్లెటిక్స్ సమాఖ్య గురువారం ప్రకటించింది.
టీమిండియా వన్డే ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఫుల్‌స్టాప్ పెట్టాడు. జట్టులో అతడి స్థానంపై సందేహాలు వద్దన్నాడు. టెస్ట్‌లు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.
బెంగాల్‌కు చెందిన భారత్ అండర్-19 క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు వేసింది. వయస్సు ధ్రువీకరణలో పదే పదే మార్పులకు పాల్పడిన అతడిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది.
డిఫెండింగ్ చాంపియన్లు కార్లోస్ అల్కారజ్, అర్యానా సబలెంక యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరారు. అయితే మూడో సీడ్ అలియాసిమెకు రెండో రౌండ్‌లో చుక్కెదురైంది.
ఆసియా క్రీడల్లో తలపడే భారత టీ20 క్రికెట్ జట్టుకు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈమేరకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ చెక్ పెట్టింది. అతడు అద్భుతంగా ఆడుతున్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
ఆసియా క్రీడలు 2026లో పాల్గొనబోయే భారత పురుషుల క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది.
పాన్ ఆమ్ కప్ బిలియర్డ్స్ చాంపియన్‌షి్‌పలో భారత క్యూయిస్ట్ ధ్రువ్ సిత్వాల రజతం దక్కించుకొన్నాడు...
పికిల్‌బాల్ ప్రపంచకప్‌లో హైదరాబాద్ ఆటగాడు తుమ్మల నవీన్ పతకంతో...