-
-
Home » Mukhyaamshalu » latest and breaking ABN Andhra Jyothy news across the world on 10th september 2025 vReddy
-
BREAKING: టీజీపీఎస్సీ కీలక నిర్ణయం..
ABN , First Publish Date - Sep 10 , 2025 | 06:13 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 10, 2025 17:28 IST
టీజీపీఎస్సీ కీలక నిర్ణయం..
ముగిసిన TGPSC కీలక సమావేశం
హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో కమిషన్ చర్చ
గ్రూప్-1 అంశంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయం
అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని TGPSC నిర్ణయం
హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వానికి TGPSC చైర్మన్ నివేదిక
ప్రభుత్వ అనుమతి రాగానే కోర్టులో TGPSC రివ్యూ పిటిషన్
-
Sep 10, 2025 15:55 IST
సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: సీఎం చంద్రబాబు
నేపాల్ ఆందోళనల్లో 200 మందికిపైగా తెలుగువారు చిక్కుకున్నారు.
వారి యోగక్షేమాలు పర్యవేక్షించాలని మంత్రి లోకేష్‌ను ఆదేశించా.
2024 ఎన్నికలు చరిత్రను తిరిగరాశాయి: సీఎం చంద్రబాబు
ఈ సభ రాజకీయాలు, ఓట్ల కోసం కాదు..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే సభ: చంద్రబాబు
సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకే వచ్చాం: చంద్రబాబు
-
Sep 10, 2025 15:39 IST
రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం: పవన్ కల్యాణ్
ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుతున్నాం: పవన్
రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి: పవన్ కల్యాణ్
ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా: పవన్ కల్యాణ్
ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోంది: పవన్ కల్యాణ్
యువత, మహిళలు, రైతులు భవిష్యత్ కోసమే సంక్షేమ పథకాలు: పవన్
ఒకేరోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించాం: పవన్ కల్యాణ్
కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Sep 10, 2025 15:22 IST
రాష్ట్రానికి ఆ నలుగురు: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో రాయదుర్గం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
మన రాజ్యాంగానికి నాలుగు ప్రధాన స్తంభాలు ఉన్నట్టే.. మన రాష్ట్రానికి నలుగు నాయకులు నిలబడి ఉన్నారు.
ప్రధాని మోదీ దేశంతో పాటు రాష్ట్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఒక రిఫార్మర్‌గా గర్వంగా చెప్పుకుంటున్నాం.
మన చంద్రన్న ఒక విజనరీ లీడర్‌గా రాష్ట్ర రూపు రేఖలనే మార్చేస్తున్నారు.
రాష్ట్ర భవిష్యత్ కోసం త్యాగాలు చేసి ఒక విప్లవకారుడుగా ముందుకొచ్చారు పవన్ కల్యాణ్.
యువనాయకుడు నారా లోకేష్ మన భవిష్యత్ నాయకుడిగా నిలబడి ఉన్నారు.
ఈ నలుగు లేకపోతే మన రాష్ట్రం కుప్పకూలిపోతుంది. మన భవిష్యత్ చీకటిలో కలిసిపోయేది.
యువత ముందుకు రావాలి. కష్టపడాలి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.
ఎన్నికల ముందు చెప్పినట్టుగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా పనిచేస్తూ.. కేవలం 15 నెలల్లోనే రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించాం.
రాష్ట్రంలో 11 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేశారు.
డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలను భర్తీ చేశాం. 6100 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశాం.
రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మరింత విశేషంగా కృషి చేస్తుందని తెలుపుకుంటున్నాను.
-
Sep 10, 2025 15:15 IST
జన సునామీని తలపిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ
అనంతపురం: జన సునామీని తలిపిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ.
ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ శ్రేణులు.
కూటమి అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి రాజకీయ సభ కావడంతో అగ్రనేతలు ఏం చెప్తారన్నదానిపై పార్టీ శ్రేణుల ఆసక్తి.
కాసేపట్లో సభను ఉద్దేశించి ప్రసంగించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు.
-
Sep 10, 2025 13:09 IST
నేపాల్ సంక్షోభం నేపథ్యంలో హెల్ప్‌లైన్ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
సీఎం రేవంత్ ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్
ఢిల్లీ తెలంగాణ భవన్ నంబర్లు: 9871999044, 9643723157, 9949351270
-
Sep 10, 2025 13:08 IST
నేపాల్‌లో చిక్కుకున్న బాధితుల్లో ఉత్తరాంధ్రులు ఉన్నట్లు గుర్తింపు
విజయనగరం, విశాఖ వాసులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ఏపీ ప్రభుత్వం
ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులు 11 మంది ఉన్నట్లు గుర్తింపు
రేపు ఉ.10 వరకు కర్ఫ్యూ ఉండటంతో ఏపీ బాధితులతో అధికారుల ఫోన్ కాంటాక్ట్‌లు
ఫోన్ కాల్స్ ద్వారా బాధితుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంటున్న అధికారులు
జిల్లాల వారీగా నేపాల్ ఉన్న వారి వివరాలను సేకరిస్తున్న అధికారులు
-
Sep 10, 2025 12:43 IST
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ బచ్చన్
తన పబ్లిసిటీ, పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పించాలని పిటిషన్
తన ఫొటోలు, పేరు అనుమతి లేకుండా ఎవరూ వాడుకోకుండా ఆదేశించాలని...
ఇప్పటికే ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయన సతీమణి, నటి ఐశ్వర్యారాయ్
-
Sep 10, 2025 12:25 IST
అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఫిచ్ నివేదిక
భారీ టారిఫ్‌ల కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి
కొత్త ఉద్యోగాల సృష్టిలో బలహీనంగా ఉందని నివేదిక
వినియోగదారుల ఖర్చు చేసే సామర్థ్యం తగ్గిందని వెల్లడి
-
Sep 10, 2025 12:17 IST
తిరుమల: టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్
శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరణ
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా బంగారు వాకిలిలోని...
గరుడల్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేసిన సింఘాల్
-
Sep 10, 2025 12:16 IST
విశాఖ: కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ వల్లే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని నేను అనను: చింతామోహన్
కేసీఆర్ ఏం చేశారో నాకు పూర్తిగా తెలుసు: కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
తెలంగాణకు దళిత సీఎం అంటూ కేసీఆర్ మాదిగలను ఆకర్షించారు: చింతామోహన్
మాదిగ సామాజిక వర్గం చేరికతో తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది: చింతామోహన్
-
Sep 10, 2025 11:32 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ భారీగా గంజాయి
బ్యాంకాక్ ప్రయాణికుడి నుంచి గంజాయి స్వాధీనం
నిందితుడు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ రిజ్వీగా గుర్తింపు
పట్టుబడ్డ గంజాయి (హైడ్రోపోనిక్) విలువ రూ.14 కోట్లు ఉంటుందని అంచనా
-
Sep 10, 2025 11:25 IST
హైదరాబాద్: కూకట్‌పల్లి సహస్ర హత్య కేసు
మైనర్ నిందితుడిని కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు
నిన్న జువైనల్ హోమ్‌లోనే కస్టడికి తీసుకుని విచారించిన పోలీసులు
జువైనల్ హోమ్‌లోనే బాల నిందితుడికి సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్
కస్టడీలోనూ క్రికెట్ బ్యాట్ కోసమే హత్య చేశానని చెప్పిన బాలుడు
-
Sep 10, 2025 11:16 IST
ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్‌కల్యాణ్ ఫొటోను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ..
దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన హైకోర్టు
డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని ప్రశ్నించిన ధర్మాసనం
రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారంటూ కొట్టివేత
సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు వేయాలని సూచన
-
Sep 10, 2025 10:08 IST
ప్రజా సమస్యల పరిష్కారమే మా టార్గెట్ తప్ప.. జగన్ కాదు: మంత్రి గొట్టిపాటి
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికతోనే జగన్ సినిమా అయిపోయింది
జగన్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలి: గొట్టిపాటి
జగన్ 5ఏళ్ల విధ్వంస పాలనా రాష్ట్రానికి చీకటి రోజులే: గొట్టిపాటి
-
Sep 10, 2025 10:07 IST
టాలీవుడ్ ప్రముఖులను బెదిరిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్
టాలీవుడ్ సినీ ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడిన కానిస్టేబుల్
డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ ఉమామహేశ్వరరావు బెదిరింపులు
పలువురు సినీ ప్రముఖుల ఇంటికి వెళ్ళి.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్
డబ్బు ఇవ్వకపోతే ఇంట్లో డ్రగ్స్ దొరికాయని కేసు పెడతానని బెదిరింపు
బాధితుల ఫిర్యాదుతో ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Sep 10, 2025 10:01 IST
నేపాల్‌లో ఉన్న భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు
ఖాట్మండ్‌లోని భారత రాయబార కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్‌లైన్ నంబర్లు
ఖాట్మండ్ హెల్ప్‌లైన్ నంబర్లు: 977-980 860 2881, 977-981 032 6134
ఏపీకి చెందిన ప్రజల కోసం ఢిల్లీ ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్ నంబర్లు
ఢిల్లీ ఏపీ భవన్ నంబర్లు: 98183 95787, 85000 27678
ఏపీఎన్‌ఆర్‌ఎస్ హెల్ప్‌లైన్ నంబర్: 0863 2340678
ఈమెయిల్ ఐడీలు: helpline@apnrts.com, info@apnrts.com
-
Sep 10, 2025 08:50 IST
కోరలు పీకేసినా.. పాము కాటేస్తుందనే రీతిలో వైసీపీ తీరుంది: మంత్రి లోకేష్
వైసీపీ అనే విష సర్పం కోరలు జనం పీకేశారు: లోకేష్
అయినా ప్రతి క్షణమూ వైసీపీ విషం కక్కుతూనే ఉంది: లోకేష్
ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆందోళనలు చేస్తున్నారు: లోకేష్
సీఎం మీడియా ముఖంగా మాట్లాడిన మాటలనే వక్రీకరించిన..
వైసీపీ విషసర్పాలను ఏం చేయాలి?: మంత్రి లోకేష్
ఫేక్ వీడియోల పట్ల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలి: లోకేష్
-
Sep 10, 2025 08:05 IST
యూపీఐ లావాదేవీలపై పరిమితులు సవరించిన NPCI,
వ్యాపారుల UPI లావాదేవీల పరిమితి రూ.5 లక్షలకు పెంపు,
ఈనెల 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త సవరణలు
-
Sep 10, 2025 07:59 IST
తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి..
సిద్దిపేట, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం
40 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం
-
Sep 10, 2025 07:17 IST
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ పోస్ట్
త్వరలోనే నా మిత్రుడు మోదీకి ఫోన్ చేస్తా: ట్రంప్
ఇండియాతో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతా: ట్రంప్
ట్రేడ్ డీల్ విజయవంతమవుతుందని ఆశిస్తున్నా: ట్రంప్
-
Sep 10, 2025 06:41 IST
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అల్లకల్లోలమైన నేపాల్
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూను ఆధీనంలోకి తీసుకున్న సైన్యం
కాఠ్‌మాండూలో నిరవధిక కర్ప్యూ విధింపు
త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం పాక్షికంగా మూసివేత
సామాజిక మాధ్యమాలపై వ్యతిరేకంగా ప్రారంభమైన జెన్-జెడ్ ఉద్యమం
ఇప్పటికే ప్రధాన పదవికి రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలి
కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు ప్రారంభం
నేపాల్ ప్రధానిగా కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా ఎన్నికైయ్యే అవకాశం
నేపాల్‌కు విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా, ఇండిగో ప్రకటన
-
Sep 10, 2025 06:41 IST
యువత ఆందోళనలో నేపాల్ మాజీ ప్రధాని సతీమణి మృతి
మాజీ ప్రధాని జలనాథ్ ఇంటికి నిప్పుపెట్టడంతో ఆయన సతీమణి గాయాలు
చికిత్సపొందుతూ మరణించిన జలనాథ్ సతీమణి రాజ్యలక్ష్మి మృతి
సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా యువత ఆందోళన
ప్రభుత్వ భవనాలు, పార్టీల కార్యాలయాలను తగలబెట్టిన ఆందోళనకారులు
ఇప్పటికే నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన కె.పి.శర్మ ఓలి
-
Sep 10, 2025 06:40 IST
ఢిల్లీ: నేడు ఉ.10 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటి కానున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణకు సంబంధించి పలు అంశాలపై చర్చించనున్న సీఎం రేవంత్
-
Sep 10, 2025 06:13 IST
నేడు అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగసభ
సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరిట కూటమి బహిరంగసభ
15నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధిపై వివరణ
ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతుందో చెప్పనున్న సీఎం
అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు కలిసి తొలిసారిగా సభ