-
-
Home » Mukhyaamshalu » latest and breaking ABN Andhra Jyothy news across the globe on 11th september 2025 vReddy
-
BREAKING: గ్రూప్-1పై అప్పీల్‌కు వెళ్లేందుకు TGPSC నిర్ణయం
ABN , First Publish Date - Sep 11 , 2025 | 06:12 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 11, 2025 20:16 IST
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి
ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తెలంగాణకు చెందిన మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ
అలాగే ఒడిశా స్టేట్ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రమోద్ యారఫ్ పాండు హతం
గరియాబంద్ జిల్లాలో కొనసాగుతున్న ఎదురుకాల్పులు
-
Sep 11, 2025 18:42 IST
కాఠ్మండూ నుంచి ఏపీ చేరుకున్న ప్రత్యేక విమానం
144 మంది తెలుగు యాత్రికులతో విశాఖకు విమానం
విమానంలో 104 మంది విశాఖ వాసులు
తిరుపతిలో మరో 40 మందిని దించనున్న విమానం
నేపాల్ నుంచి తెలుగు వారిని తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
-
Sep 11, 2025 18:40 IST
ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ
పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి
విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి
తూర్పుగోదావరి కలెక్టర్‌గా కీర్తి చేకూరి
గుంటూరు కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా
పల్నాడు కలెక్టర్‌గా కృతిక శుక్లా
బాపట్ల కలెక్టర్‌గా వినోద్ కుమార్
ప్రకాశం కలెక్టర్‌గా రాజాబాబు
నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా
అన్నమయ్య కలెక్టర్‌గా నిషాంత్ కుమార్
కర్నూలు కలెక్టర్‌గా ఎ.సిరి
అనంతపురం కలెక్టర్‌గా ఆనంద్
సత్యసాయి కలెక్టర్‌గా శ్యాంప్రసాద్
-
Sep 11, 2025 17:55 IST
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం
హైదరబాద్-విజయవాడ హైవేని ముంచెత్తిన వరద
హయత్‌నగర్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో భారీగా వరద
ఆటోనగర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు ట్రాఫిక్ జామ్
వనస్థలిపురంలో పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వర్షపునీరు
ఎల్బీనగర్, నాగోల్, బీఎన్‌రెడ్డి నగర్, కొత్తపేట, చైతన్యపురిలో వర్షం
-
Sep 11, 2025 17:53 IST
గ్రూప్-1పై అప్పీల్‌కు వెళ్లేందుకు TGPSC నిర్ణయం
సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయనున్న TGPSC
వారం రోజుల్లో TGPSC పిటిషన్ దాఖలు చేసే అవకాశం
తీర్పు కాపీపై గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తున్న TGPSC లీగల్ సెల్
రీవాల్యుయేషన్ చేస్తే టెక్నికల్ సమస్యలు వస్తాయని TGPSC అభిప్రాయం
గ్రూప్-1 నియామకాల్లో లోపాలు లేవని వాదించనున్న TGPSC
-
Sep 11, 2025 17:38 IST
అమరావతి: ఇరిగేషన్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఈ ఏడాది వర్షాలు తగ్గినా నీటి సమస్య రాలేదు: సీఎం చంద్రబాబు
రెండేళ్లలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తికావాలి: చంద్రబాబు
భూగర్భ జలాల నమోదుకు 3 నెలల్లో కొత్త సెన్సార్లు: చంద్రబాబు
శ్రీశైలం డ్యామ్ రక్షణ పనులకు ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు
-
Sep 11, 2025 17:38 IST
హైదరాబాద్: మాదాపూర్ ఏవీ టెక్నాలజీ పేరుతో భారీ మోసం
స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో రూ.1,000 కోట్ల మోసం
ఏవీ టెక్నాలజీస్, ఐఐటీ టెక్నాలజీస్, ఏవీ రియాల్టీ పేరుతో కంపెనీలు
తమ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే 6% వడ్డీ ఇస్తామంటూ మోసం
తెలుగు రాష్ట్రాల్లో 4,500 మందికిపైగా బాధితులు
-
Sep 11, 2025 17:06 IST
హైదరాబాద్: గొర్రెల స్కాం కేసు బాధితులకు ఈడీ నోటీసులు
ఈనెల 15న ED కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశం
గొర్రెల స్కాం కేసులో ఇప్పటికే కొనసాగుతున్న ACB దర్యాప్తు
ఏసీబీ విచారణ ఆధారంగా ఈడీ దర్యాప్తు
ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ఎగవేసిన బ్రోకర్లు
అధికారులు, బ్రోకర్లు పథకం నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణ
గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డుల తయారీ ఆరోపణలు
వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఏసీబీ ఆరోపణ
-
Sep 11, 2025 17:06 IST
హన్మకొండ: నయీంనగర్‌లోని ప్రైవేట్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత
స్కూల్‌లో పదోతరగతి విద్యార్థి జయంత్ వర్థన్ అనుమానాస్పద మృతి
ప్రైవేట్ స్కూల్ ప్రధాన గేటు దగ్గర విద్యార్థి సంఘాల ధర్నా
జయంత్ మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపణ
పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంతో పాటు..
మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
Sep 11, 2025 17:06 IST
నేపాల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత
నాయకత్వ ఎంపికపై రెండుగా చీలిన ఆందోళనకారులు
సుశీలా ఖత్రి, బాలేన్ షా వర్గాల వాగ్యుద్ధం
-
Sep 11, 2025 17:06 IST
తెలంగాణ పంచాయతీరాజ్ రెండో చట్టసవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం
గవర్నర్ సంతకం చేయడంతో గెజిట్ విడుదల చేసిన తెలంగాణ రాజ్‌భవన్
సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలుగా ఏర్పాటు
ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణతో పాటు నల్గొండ జిల్లా హాలియా పరిధి ఇబ్రహీంపేటను గ్రామపంచాయతీగా ఏర్పాటు
స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ల సడలింపునకు ఉద్దేశించిన తెలంగాణ పంచాయతీరాజ్ మూడో చట్టసవరణ బిల్లుకు లభించని ఆమోదం
-
Sep 11, 2025 15:33 IST
ఇంకా పెండింగ్‌లోనే తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు
రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోని రాజ్‌భవన్
పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో గందరగోళం
-
Sep 11, 2025 14:31 IST
సీపీ రాధాకృష్ణన్ రాజీనామా..
మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా
రేపు ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్న సీపీ రాధాకృష్ణన్
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి ముర్ము
-
Sep 11, 2025 13:22 IST
తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
-
Sep 11, 2025 13:04 IST
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులు..
త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వేలైన్ ఉండాలి
-
Sep 11, 2025 13:02 IST
దేశంలో భారీ కుట్రకు ప్రణాళిక కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు
ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు
ఢిల్లీలో ఇద్దరు, తెలంగాణ, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లో ఒక్కొక్కరు అరెస్ట్
ఉగ్రవాదుల నుంచి భారీగా తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం
ఉగ్రవాదులకు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్టు గుర్తించిన పోలీసులు
సోషల్ మీడియా ద్వారా పాక్‌లోని హ్యాండర్లతో సంప్రదింపులు
అరెస్టయినవారిలో అష్రఫ్ డానిష్ కీలక వ్యక్తిగా సమాచారం
-
Sep 11, 2025 12:32 IST
రాత్రి ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు
-
Sep 11, 2025 12:31 IST
ఈనెల 13న మేడారం పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి
మేడారం అభివృద్ధి పనులపై సమీక్షించనున్న సీఎం రేవంత్
ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేయనున్న సీఎం
2026 జనవరి 28 నుంచి మేడారం జాతర
మేడారం అభివృద్ధికి రూ.150కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
-
Sep 11, 2025 11:33 IST
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
అబ్సల్యూట్ బార్బిక్ క్యూ ఔట్‌లెట్స్‌లో సోదాలు
ఇనార్బిట్ మాల్‌లోని అబ్సల్యూట్ బార్బిక్‌లో కుళ్లిన మాంసం
బంజారాహిల్స్, గచ్చిబౌలి ఔట్‌లెట్స్‌లోని కిచెన్స్‌లో బొద్దింకలు
మేడిపల్లి ఔట్‌లెట్‌లో గడువు ముగిసిన ఫుడ్ సప్లయ్
ఏఎస్‌రావు నగర్ ఔట్‌లెట్‌లోని స్టోర్‌రూమ్‌లో ఎలుకలు గుర్తింపు
ఫ్లోర్‌పైనే ఫుడ్ స్టోర్ చేస్తున్న నిర్వాహకులు
అబ్సల్యూట్ బార్బిక్ నిర్వాహకులకు నోటీసులు
-
Sep 11, 2025 11:19 IST
పాక్ దౌత్యవేత్త అమిర్ జుబేర్‌కు NIA కోర్టు సమన్లు
అక్టోబర్ 15న విచారణకు హాజరుకావాలని NIA ఆదేశం
భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై దాడులకు అమిర్ జుబేర్ సిద్దిఖీ కుట్ర చేసినట్టు ఆరోపణలు
-
Sep 11, 2025 10:44 IST
రూ.3,472 కోట్లతో ఆర్బీఐ భారీ ల్యాండ్ డీల్
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి..
4.61 ఎకరాల భూమి కొనుగోలు చేసిన రిజర్వ్ బ్యాంక్
ఈ ఏడాది దేశంలో ఇదే అతిపెద్ద భూలావాదేవీ కావడం గమనార్హం
దక్షిమ ముంబైలోని నారీమన్ పాయింట్ దగ్గర ఉన్న..
ఈ భూమికి సమీపంలోనే బాంబే హైకోర్టు, మంత్రాలయ వంటి వీవీఐపీ భవనాలు
-
Sep 11, 2025 10:38 IST
అనంతపురం బహిరంగ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి
ఆల్ సెంటర్స్ పెర్ఫార్మెన్స్ నిల్ అన్నట్టుగా వైసీపీ మిగిలింది: గొట్టిపాటి
రైతు పోరు అంటూ హడావుడి చేస్తే ఒక్క రైతు మద్దతు తెలపలేదు: గొట్టిపాటి
-
Sep 11, 2025 10:38 IST
రష్యా సైన్యంలో భారతీయుల నియామకాలపై స్పందించిన కేంద్ర విదేశాంగశాఖ
రష్యా సైన్యంలో చేరిక ఆఫర్లకు భారతీయులు దూరంగా ఉండాలి: విదేశాంగశాఖ
మాస్కో అధికారులతో చర్చలు జరుపుతున్నాం: భారత విదేశాంగశాఖ
-
Sep 11, 2025 10:34 IST
ఏపీలో 11 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారుల బదిలీలు
పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్రప్రసాద్
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్.శ్రీధర్
ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా శర్వణన్
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్‌గా శ్రీకాంతనాథరెడ్డి
శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్‌గా విజయ్‌కుమార్
కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్‌గా బి.వి.ఎ.కృష్ణమూర్తి
సిల్వి కల్చరిస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారిణిగా బబిత
డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా జి.జి.నరేంద్రన్
తిరుపతి డీఎఫ్‌వోగా వి.సాయిబాబా
ఆత్మకూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా విఘ్నేష్‌అప్పావో
నెల్లూరు అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్‌గా పి.వివేక్
-
Sep 11, 2025 09:54 IST
నేపాల్ సిమికోట్ నుంచి బయల్దేరిన యాత్రికుల బృందం
నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చిక్కుకుపోయిన యాత్రికులు
సిమికోట్ నుంచి నేపాల్ గంజ్‌కు చేరుకోనున్న యాత్రికుల బృందం
టీడీపీ ఎంపీ సానా సతీష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో పయనం
-
Sep 11, 2025 09:01 IST
ఏపీలో భారీగా IAS, IPSల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు
RT NO 1665తో ట్రాన్స్ఫర్లు సబ్జెక్ట్ నేమ్‌తో నిన్న రాత్రి ఖాళీ జీవో అప్‌లోడ్
ఇవాళ భారీస్థాయిలో అధికారుల బదిలీలు ఉండే అవకాశం
ఇవాళ, రేపు, ఎల్లుండిలోపు బదిలీల ప్రక్రియ పూర్తికి నిర్ణయం
ఈనెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్
అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బదిలీల ప్రక్రియకు సన్నాహాలు
-
Sep 11, 2025 08:48 IST
గుంటూరు: తురకపాలెంలో మరణాలపై వీడని మిస్టరీ
తురకపాలెంలో ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ చేసిన డీఎంహెచ్‌వో విజయలక్ష్మి
మృతుల్లో పలువురు తొలుత ఆర్‌ఎంపీ దగ్గరే చికిత్స పొందినట్లు ఆధారాలు
యాంటీబయాటిక్స్, సెలైన్లు అధిక వాడకమే కారణంగా భావిస్తున్న పోలీసులు
-
Sep 11, 2025 08:43 IST
కాకినాడ జనసేన ఎంపీ పేరిట సైబర్ నేరగాళ్ల టోకరా
వాట్సాప్‌లో ఎంపీ డీపీ పెట్టి డబ్బు వసూలు చేసిన కేటుగాళ్లు
11 సార్లు ఎంపీ పేరు చెప్పి రూ.92 లక్షలు వసూలు
వాట్సాప్‌లో ఎంపీ డీపీ పెట్టుకుని..
డబ్బు పంపాలంటూ టీ-టైమ్ మేనేజర్‌కు కేటుగాళ్ల మెసేజ్‌లు
ఎంపీ అడిగారని డబ్బు పంపిన టీ-టైమ్ మేనేజర్
టీ-టైమ్ బిజినెస్ నిర్వహిస్తున్న కాకినాడ ఎంపీ
ఇటీవల టీ-టైమ్ మేనేజర్, ఎంపీ కలుసుకోవడంతో బయటపడ్డ మోసం
-
Sep 11, 2025 08:05 IST
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాపట్ల పర్యటన రద్దు
హెలికాప్టర్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడం పర్యటన రద్దు
-
Sep 11, 2025 07:11 IST
నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్‌వీ పిలుపు
గ్రూప్-1 విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్
-
Sep 11, 2025 07:04 IST
యెమెన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
35 మంది హూతీలు మృతి, 130 మందికి గాయాలు
ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు చేస్తామని హూతీలు హెచ్చరిక
-
Sep 11, 2025 07:02 IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య
ఉటా కౌంటీలోని వర్సిటీలో చార్లీ కిర్క్‌పై కాల్పులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చార్లీ కిర్క్ మృతి
చార్లీ కిర్క్ మృతిపట్ల డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి
కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశం
-
Sep 11, 2025 06:57 IST
ఫార్ములా-ఈ కేసులో నేడు విజిలెన్స్ ముందుకు ACB నివేదిక
నివేదిక పరిశీలించి గవర్నర్‌కు పంపనున్న తెలంగాణ ప్రభుత్వం
-
Sep 11, 2025 06:54 IST
ఏపీ లిక్కర్ కేసులో నేడు హైకోర్టులో కీలక విచారణ
సిట్ పిటిషన్‌పై విచారించనున్న ఏపీ హైకోర్టు
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్ప..
డీఫాల్ట్ బెయిల్ సవాల్ చేస్తూ సిట్ పిటిషన్
-
Sep 11, 2025 06:33 IST
నేడు నేపాల్ నుంచి ఏపీ వాసుల తరలింపునకు రంగం సిద్ధం
ఖాట్మండు నుంచి ప్రత్యేక విమానం 217 మంది తరలింపు
తొలి విడతగా హెటౌడాలో 22 మందిని బిహార్ సరిహద్దుకు తరలింపు
బిహార్ సరిహద్దు నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్‌కు తరలింపు
-
Sep 11, 2025 06:28 IST
నేడు బాపట్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
సూర్యలంక దగ్గర నగరవనాన్ని సందర్శించనున్న పవన్
మృతిచెందిన అటవీశాఖ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికసాయం
-
Sep 11, 2025 06:12 IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వర్షసూచన
తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
40-60 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం