Gukesh Abhimanyu Mishra: ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌ను ఓడించిన 16 ఏళ్ల కుర్రాడు
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:23 PM
చెస్ ప్రపంచంలో 16 ఏళ్ల యువ అమెరికన్ అభిమన్యు మిశ్రా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్‌ను క్లాసికల్ చెస్ గేమ్‌లో ఓడించి వార్తల్లో నిలిచాడు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు 16 ఏళ్ల అమెరికన్ యువ చెస్ స్టార్ అభిమన్యు మిశ్రా (Abhimanyu Mishra). ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్‌ను (Gukesh) క్లాసికల్ చెస్ గేమ్‌లో ఓడించి, చరిత్రలోనే అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. సోమవారం జరిగిన FIDE గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ ఐదో రౌండ్‌లో ఈ అద్భుత విజయాన్ని అభిమన్యు సాధించాడు.
గుకేశ్‌కు ఈ మ్యాచ్‌లో ఇబ్బందులు మొదటి ఆట నుంచే మొదలయ్యాయి. ఇటాలియన్ ఓపెనింగ్‌లో అభిమన్యు తన ప్రత్యర్థిని అనూహ్యంగా ఆశ్చర్యపరిచాడు. భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ ఆటగాడు.. గుకేశ్‌ను మిడిల్ గేమ్‌లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. గుకేశ్ తన చాకచక్యంతో ఈ దాడి నుంచి దాదాపు తప్పించుకున్నాడు. కానీ చివరకు అభిమన్యు ఈ భారీ విజయాన్ని సాధించాడు.
ఈ విజయం తన కెరీర్‌లో అతిపెద్దదైనా, అభిమన్యు పూర్తిగా సంతృప్తి చెందలేదు. నేను గెలిచినా, ఈ గేమ్ నా మునుపటి ఆటల్లాగా అంత ఆనందాన్ని ఇవ్వలేదన్నాడు Abhimanyu Mishra. ఇది పర్ఫెక్ట్ గేమ్ కాదని అతను FIDEలో చెప్పాడు. కానీ ఈ టోర్నమెంట్ నేను ఊహించిన దానికంటే చాలా బాగా సాగుతోందని, ఈ ఫామ్‌ను కొనసాగిస్తే, తాను టోర్నమెంట్ గెలిచే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. నిన్న ఆడిన గేమ్‌లో కూడా నేను కొన్ని తప్పులు చేశాను. కానీ గుకేశ్ వంటి ఆటగాళ్లతో నేను ఏమాత్రం తక్కువ కాదని భావిస్తున్నట్లు చెప్పాడు.
అభిమన్యు మిశ్రా ఈ టోర్నమెంట్‌లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గుకేశ్‌ను ఓడించడం ద్వారా అతను తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. అయితే అతని లక్ష్యం ఇంకా పెద్దదని చెబుతున్నాడు. ఈ యువ ఆటగాడు రాబోయే రౌండ్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి