Asia Cup 2025: నేడు ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్ ఫస్ట్ మ్యాచ్..ఎవరు గెలుస్తారంటే..
ABN , Publish Date - Sep 09 , 2025 | 07:38 AM
క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025, నేడు అబుదాబి షేక్ జాయిద్ స్టేడియంలో మొదలవుతుంది. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువ, పిచ్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఆసియా కప్ 2025లో (Asia Cup 2025) నేడు మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ (Afghanistan vs Hong Kong) మధ్య రాత్రి 8 గంటలకు (IST) మొదలు కానుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు గ్రూప్ Bలో ఉన్నాయి. ఇందులో శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి బలమైన టీమ్స్ కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను రషీద్ ఖాన్ కెప్టెన్ కాగా, హాంకాంగ్‌కు యాసిమ్ ముర్తజా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? వీరిలో గెలిచే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
స్పిన్ మాయాజాలం, కానీ ఆందోళన
ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నమెంట్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వీళ్ల స్పిన్ బౌలింగ్ లైనప్ అద్భుతమని చెప్పవచ్చు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహమాన్, అల్లా ఘజన్‌ఫర్ లాంటి స్పిన్నర్లు బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపిస్తారు. షేక్ జాయెద్ స్టేడియం పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, వీళ్ల బౌలింగ్ ఇక్కడ ప్రత్యర్థి జట్లకు మరింత ఇబ్బందిగా మారవచ్చు.
వాళ్ల స్టార్ బ్యాట్స్‌మన్
కానీ, ఆఫ్ఘనిస్తాన్‌కు ఒక సమస్య ఉంది. ఇటీవల జరిగిన UAE ట్రై-సిరీస్ ఫైనల్‌లో పాకిస్తాన్‌తో ఓడిపోయారు. అది కూడా ఘోరంగా 66 పరుగులకే ఆలౌట్ అయ్యారు. వాళ్ల స్టార్ బ్యాట్స్‌మన్ రహ్మానుల్లా గుర్బాజ్ ఫామ్‌లో లేడు, ఇది వాళ్లకు పెద్ద ఆందోళన. ఇబ్రహీం జద్రాన్, సెడికుల్లా అటల్ లాంటి బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. ఇబ్రహీం జద్రాన్ ఈ ఏడాది T20ల్లో 38.8 యావరేజ్‌తో 132.87 స్ట్రైక్ రేట్‌తో రాణిస్తున్నాడు. మహ్మద్ నబీ, కరీం జనత్ లాంటి ఆల్‌రౌండర్లు జట్టుకు బ్యాలెన్స్ ఇస్తారు.
హాంకాంగ్
హాంకాంగ్ ఆసియా కప్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడింది, కానీ ఒక్కటి కూడా గెలవలేదు. అయినా, వాళ్లు ఈసారి ఆశాభావంతో ఉన్నారు. ఓపెనర్ అంశుమాన్ రథ్ వాళ్లకు చాలా కీలకం. ఈ ఏడాది T20ల్లో 726 పరుగులతో 48.4 యావరేజ్, 144.3 స్ట్రైక్ రేట్‌తో రాణిస్తున్నాడు. అతనితో పాటు జీషాన్ అలీ, బాబర్ హయాత్ లాంటి బ్యాట్స్‌మెన్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ దాడిని ఎదుర్కొవాలి. యాసిమ్ ముర్తజా, ఆయుష్ శుక్లా బౌలింగ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. హాంకాంగ్ బౌలింగ్ లైనప్‌లో స్పిన్ ఆధిపత్యం ఉంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం అంత ఈజీ కాదు.
పిచ్ రిపోర్ట్, టాస్
షేక్ జాయెద్ స్టేడియం పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కష్టమవుతుంది. పొగమంచు కారణంగా ఛేజింగ్ కొంచెం సవాలుగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిస్తే, వాళ్లు బౌలింగ్ ఎంచుకుని హాంకాంగ్ బ్యాటింగ్‌ను త్వరగా కుప్పకూల్చే ప్లాన్‌లో ఉండొచ్చు.
హెడ్-టు-హెడ్
ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ T20ల్లో ఇప్పటివరకు 5 సార్లు తలపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ 3-2తో ఆధిపత్యంలో ఉంది. హాంకాంగ్ చివరిసారిగా 2015లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది, కానీ అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ బాగా మెరుగైంది. నిపుణుల ప్రిడిక్షన్ ప్రకారం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్. కానీ హాంకాంగ్ చిన్న జట్టు అని తక్కువగా అంచనా వేయలేం. టీ20 మ్యాచులో ఒక్క ఆటగాడు కూడా మ్యాచ్ తీరును మొత్తం మార్చే అవకాశం ఉంటుంది.
ఎక్కడ చూడాలి?
ఈ మ్యాచ్‌ను భారత్‌లో Sony Sports Networkలో లైవ్‌గా చూడొచ్చు. ఆన్‌లైన్‌లో SonyLiv యాప్ లేదా వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. మ్యాచ్ రాత్రి 8:00 PM IST నుంచి ప్రారంభమవుతుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి