Home » Sports news
పాకిస్థాన్ జట్టు మహిళల టీ20 ఆసియాకప్ సెమీస్‌కు చేరింది. సోమవారం గ్రూప్-ఎలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 72 పరుగులతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. మొత్తం నాలుగు పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన పాక్.. శుక్రవారం జరిగే సెమీస్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.
దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను ఈస్ట్‌జోన్ అద్భుతంగా ఆరంభించింది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న ఈ పోరులో కెప్టెన్ ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 111 బ్యాటింగ్) అజేయ సెంచరీతో నిలిచాడు. ఇతర బ్యాటర్లు కూడా చెలరేగడంతో ఆదివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 385 పరుగులు సాధించింది.
వరుసగా మూడోసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకొనే దిశగా టాప్ సీడ్ అర్యాన సబలెంక మరో అడుగు వేసింది. ఈ వరల్డ్ నెం.1 బెలారస్ భామ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో సబలెంక 6-4, 6-3తో టౌన్‌సెండ్‌ను వరుస సెట్లలో ఓడించింది.
టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఆమె మరో 78 పరుగులు సాధిస్తే, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది.
భారత్‌కు చెందిన మూడో సీడ్ అన్మోల్ ఖర్బ్ ఇండోనేసియా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో ప్రవేశించింది.
ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ మూడో అంచె టోర్నీ శనివారం ఇక్కడ ప్రారంభం కానుంది. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో 29 మంది ఆర్చర్లతో మన బృందం బరిలో దిగుతోంది. అయితే 19 ఏళ్ల శీతల్ దేవిపైనే ప్రధానంగా అందరి దృష్టీ నిలవనుంది.
వరుసగా గత మూడు సీజన్లు అలరించిన గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) మళ్లీ వచ్చేసింది. ఈ నాలుగో సీజన్ లీగ్ శనివారం బెంగళూరు వేదికగా మొదలవనుంది.
టీమిండియాకు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి తన సత్తా చాటాడు. యూపీ టీ20 లీగ్ 2026లో లఖ్‌నవూ ఫాల్కన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగడానికి ధోనీ సుముఖంగా లేడని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ సుబ్రమణియం బద్రీనాథ్ చెప్పాడు. ఐపీఎల్‌లో తాను ఫుల్‌టైమ్ ఆటగాడిగానే కొనసాగాలనుకొంటున్నట్టు ధోనీ చెప్పాడన్నాడు.
వెటరన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఈక్రమంలో వరల్డ్ నెం.9 విక్టర్ లాయ్‌కి షాకిచ్చాడు. స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్/చిరాగ్ కూడా ముందంజ వేయగా..వర్ధమాన తార తన్వీశర్మ రెండో రౌండ్‌లో ఓటమి చవిచూసింది.