India vs Bangladesh Asia Cup: నేడు ఆసియా కప్‌లో భారత్, బంగ్లా మ్యాచ్..ప్రిడిక్షన్ ఏంటి, ఓడితే ఎలా..
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:45 AM
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే నేడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సమరంలో భారత్ ఓడితే పరిస్థితి ఏంటి, విన్ ప్రిడక్షన్ ఎలా ఉందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశలో భారత్, బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ఈ రోజు (సెప్టెంబర్ 24, 2025న) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. ఎందుకంటే ఇది ఫైనల్‌కు చేరే అవకాశాలను డిసైడ్ చేస్తుంది. భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అన్ని మ్యాచుల్లో గెలిచింది. బంగ్లాదేశ్ కూడా శ్రీలంకపై విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.
భారత జట్టు ఫామ్
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈ ఆసియా కప్‌లో మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడు గెలిచి, సూపర్ ఫోర్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్‌పై ఆరు వికెట్ల తేడాతో సాధించిన విజయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు.
శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు బ్యాటింగ్‌లో బలంగా ఉన్నారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది.
బంగ్లాదేశ్ జట్టు ఆశలు
బంగ్లాదేశ్ జట్టు లిట్టన్ దాస్ నాయకత్వంలో సూపర్ ఫోర్ దశలో శ్రీలంకపై గెలిచి ఊపు మీద ఉంది. టాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హుస్సేన్ లాంటి బ్యాట్స్‌మెన్ జట్టుకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బౌలింగ్‌లో టాస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్ లాంటి పేసర్లు భారత బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టే సత్తా కలిగి ఉన్నారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని, భారత్‌ను ఓడిస్తే ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది.
హెడ్-టు-హెడ్ రికార్డ్
భారత్, బంగ్లాదేశ్ ఆసియా కప్‌లో ఇప్పటివరకు 17 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 16 మ్యాచ్‌లలో విజయం సాధించగా, బంగ్లాదేశ్ కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం చూస్తే ఈ మ్యాచులో భారత్ గెలిచేందుకు 91 శాతం అవకాశం ఉండగా, బంగ్లా జట్టుకు 9 శాతం ఛాన్స్ ఉంది.
ఒకవేళ భారత్ ఓడినా, ఫైనల్‌కు చేరే అవకాశం ఇంకా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మూడు వరుసగా గెలిచి అగ్రస్థానంలో ఉంది. కానీ బంగ్లాదేశ్‌కు ఈ విజయం ఫైనల్‌కు చేరేందుకు చాలా కీలకం. ఈ రోజు రాత్రి 8 గంటలకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీలివ్ యప్‌టీవీలలో ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌ను చూడవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి