ED Inquiry: ఈడీ ముందు యువీ హాజరు
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:22 AM
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన కేసుకు సంబంధించి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్...
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన కేసుకు సంబంధించి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యాడు. తన లీగల్ టీమ్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చిన యువీని ప్రశ్నించిన అధికారులు.. అనంతరం అతని వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ క్రికెటర్లు రైనా, ధవన్, ఊతప్పలను ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.