Share News

Abhishek Sharma: పాకిస్తాన్‌పై మొదటి బంతికే అభిషేక్ శర్మ సిక్స్..సరికొత్త రికార్డు

ABN , Publish Date - Sep 22 , 2025 | 09:39 AM

భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ మరోసారి తన ఆటతీరుతో చరిత్ర సృష్టించాడు. సెప్టెంబర్ 21న దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించిన తొలి బంతికే అభిషేక్ భారీ సిక్సర్‌ కొట్టి వావ్ అనిపించాడు. దీంతో తన ఖాతాలో రెండు రికార్డులు వచ్చి చేరాయి.

Abhishek Sharma: పాకిస్తాన్‌పై మొదటి బంతికే అభిషేక్ శర్మ సిక్స్..సరికొత్త రికార్డు
Abhishek Sharma Hits First Ball Six

భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరోసారి తన దూకుడు బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సెప్టెంబర్ 21న దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో (India vs Pakistan) ఇన్నింగ్స్ ఆరంభించిన అభిషేక్, తొలి బంతికే భారీ సిక్స్ కొట్టి చరిత్ర సృష్టించాడు.

పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షాహ్ అఫ్రిది వేసిన తొలి బంతినే అభిషేక్ మిడాన్ ఓవర్‌లో బౌండరీకి కొట్టి, అభిమానుల్లో మంచి జోష్ నింపాడు. ఇది కేవలం స్టైలిష్ షాట్ మాత్రమే కాదు, ఓ అరుదైన రికార్డు కూడా. ఒకే క్రికెటర్ భారత్ తరపున రెండు సార్లు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టిన తొలి ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు.


రెండు ఫస్ట్ బాల్ సిక్స్‌లు

ఇది తొలి సారి కాదు. సెప్టెంబర్ 10, 2025న యూఏఈపై మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టాడు. అప్పుడు UAE బౌలర్ హైదర్ అలీ వేసిన తొలి బంతిని దూకుడుగా స్టాండ్స్‌లోకి కొట్టాడు. ఇప్పుడు రెండోసారి షాహీన్ అఫ్రిది బౌలింగ్‌ను అదే విధంగా ఎదుర్కొన్నాడు. రెండు సందర్భాలూ భారత ఇన్నింగ్స్ ఛేజింగ్‌లోనే ఉన్నాయి.


భారత ఆటగాళ్లలో అభిషేక్ ముందంజ

భారత టీ20 క్రికెట్ చరిత్రలో తొలి బంతికే సిక్స్ కొట్టిన ఆటగాళ్ల సంఖ్య కేవలం నలుగురు మాత్రమే. ఈ అరుదైన ఘనతను అభిషేక్ శర్మ రెండుసార్లు సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (2021లో ఇంగ్లాండ్‌పై అడిల్ రషీద్ బౌలింగ్‌లో, అహ్మదాబాద్), యశస్వి జైస్వాల్ (2024లో జింబాబ్వేపై సికందర్ రజా బౌలింగ్‌లో, హరారే), సంజు శాంసన్ (2025లో ఇంగ్లాండ్‌పై జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో, ముంబయి), అభిషేక్ శర్మ (2025లో యూఏఈపై హైదర్ అలీ, దుబాయ్. పాకిస్తాన్‌పై షాహీన్ అఫ్రిది, దుబాయ్) జరిగింది.


ఇప్పటి వరకు..

షాహీన్ అఫ్రిది తన కెరీర్‌లో 70 సార్లు టీ20 ఇంటర్నేషనల్స్‌లో తొలి ఓవర్ వేశాడు. కానీ ఇప్పటి వరకు ఎవరూ అతని బౌలింగ్ స్పెల్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టలేదు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఇది ఆయన ధైర్యమైన ఆట శైలికి నిలువెత్తు సాక్ష్యమని క్రీడా వర్గాలు అంటున్నాయి. అభిషేక్ శర్మ ఆడే విధానం చూస్తుంటే యువరాజ్ సింగ్‌ను గుర్తుచేస్తోందని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 09:40 AM