Home » Sircilla
గొర్రెలు, మేకల పెంప కందారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టడంపై గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయ కులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం, మంత్రి, విప్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
మహాలక్ష్మి పథకం పేరిట మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ప్రయాణి కులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని కలెక్టరేట్‌లో జిల్లా ఇంచార్జి బీసీ అభివృద్ధి అదికారి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలుశాఖల అధికారులతో కలిసి లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాం గ్రెస్ ప్రజాపాలనలో రైతులే రాజులని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మధు ర ఫంక్షన్ హాల్‌లో ఎలిగేడు ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం సర్వసభ్య సమావే శంలో ప్రసంగించారు.
అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వృద్ధ రోగిని బతికుండగానే చనిపోయాడని వైద్యులు తేల్చిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల వేదికగా లక్ష మందితో సభను నిర్వహించి ఆ పార్టీకి సవాల్ విసరాలని కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఈనెల 30న కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, సిరిసిల్లలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.
జిల్లాలో పలు గుట్టలను అక్రమార్కులు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిపేస్తున్నారు. పలు గ్రామాల చుట్టూ సహజ సిద్ధంగా హరితవనాలతో ఆహ్లాదాన్ని పంచే పచ్చని గుట్టలపై జరుగుతున్న ప్రకృతి విధ్వంసం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వీటి వెనుక పలువురు నేతలు ఉండడంతో అడ్డుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు.
ప్రజా పాలనకు వెయ్యి రోజులు దాటిన సందర్భంగా చలో సిరిసిల్ల పేరిట తలపెట్టిన సీఎం భారీ బహిరంగ సభ విజయవంతం కాంగ్రెస్ నేతలకు సవాల్‌గా మారింది. ఈనెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాదయాత్ర, లక్ష మంది జన సమీకరణ లక్ష్యంగా బహిరంగ సభ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
ఖరీఫ్ సీజన్‌లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. అక్టోబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 325 కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈసారి కూడా పంట దిగుబడికి అనుగుణంగా అంతే స్థాయిలో కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావా లని ఏర్పాట్లు చేస్తున్నారు.
వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి.శ్రీరాములుతో కలిసి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.