Share News

రామగుండం ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:20 AM

రామగుండం ప్రజలు అభి వృద్ధికి పట్టం కట్టారని, ఇది రామగుండం ప్రజలు, సింగరేణి కార్మిక కుటుంబాల విజయమని, వారికి పాదాభివందనాలు చేసుకుంటు న్నానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రామగుండం ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారు

కోల్‌సిటీ, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రామగుండం ప్రజలు అభి వృద్ధికి పట్టం కట్టారని, ఇది రామగుండం ప్రజలు, సింగరేణి కార్మిక కుటుంబాల విజయమని, వారికి పాదాభివందనాలు చేసుకుంటు న్నానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్‌, బీజేపీలు అనేక తప్పుడు అభియోగాలు మోపారని, కుటుంబాలను బాధించే విధంగా సోషల్‌ మీడియాలో వేధించారన్నారు. వీరందరి చెంప చెల్లుమనిపిం చేలా ప్రజలు గొప్ప తీర్పునిచ్చారన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేసే విధంగా పొత్తు పెట్టుకున్నాయని, వారికి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. బీజేపీ నాయకులు డబ్బు సంచులు పట్టుకుని వచ్చి వెదజల్లారని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశా రని, దేవుళ్ల పేర రాజకీయం చేసే ప్రయత్నం చేశారన్నారు. కొందరు ఇసుక, బూడిద, మట్టి దోపిడీ అంటూ ప్రచారాలు చేశారన్నారు. తాము గుళ్లు కట్టేవాళ్లమే కానీ కూల్చేవాళ్లము కాదని ప్రజలు గ్రహిం చారన్నారు. కాంగ్రెస్‌లో కొందరు పార్టీకి పని చేసిన వారికి డబ్బులు ఉన్నా, లేకున్నా ప్రాధాన్యతనిచ్చి సీట్లు ఇచ్చామని, దీనిని జీర్ణించు కోలేని కొందరు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారన్నారు. నాలుగు చోట్ల నష్టం జరిగిందన్నారు. సుమారు పది స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు రెండు ఓట్లు, నాలుగు ఓట్లు, 15ఓట్లు, 20ఓట్ల తేడాతో ఓడిపోయారని, వారికి పార్టీలో పూర్తి గుర్తింపు ఉంటుందని, అన్నీ రకాలుగా అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్‌లో జరిగిన నష్టాలు, పొరపాట్లను సరి చేసుకుంటామని, భవిష్యతో మరింత ఉత్సాహంతో నగరాభివృద్ధికి పాటుపడుతామన్నారు. ఈ విజయం రామగుండం ప్రజల విజయమని, రేవంత్‌రెడ్డికి దన్నుగా నిలిచిన ప్రజలకు ధన్యవా దాలు చెబుతున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశం లో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కాల్వ లింగస్వామితో పాటు మనాలీ ఠాకూర్‌, మహంకాళి స్వామి, శ్రీనివాస్‌, రాజిరెడ్డి, యుగంధర్‌, గట్ల రమేష్‌, ముస్తాఫా, కాంగ్రెస్‌ నుంచి కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:20 AM