Share News

రామగుండం మేయర్‌ పీఠంపై బీఆర్‌ఎస్‌ ఆశలు

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:54 PM

రామగుండం నగరపాలక సంస్థ మేయర్‌ పీఠంపై విపక్ష బీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో తమకు 20 నుంచి 25శాతం సీట్లు వస్తాయని లెక్కలు కడుతున్న ఆ పార్టీ నాయకులు క్యాంపులు మొదలుపెట్టారు.

రామగుండం మేయర్‌ పీఠంపై బీఆర్‌ఎస్‌ ఆశలు

కోల్‌సిటీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ మేయర్‌ పీఠంపై విపక్ష బీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో తమకు 20 నుంచి 25శాతం సీట్లు వస్తాయని లెక్కలు కడుతున్న ఆ పార్టీ నాయకులు క్యాంపులు మొదలుపెట్టారు. ఆ పార్టీ అధిష్టానం రామగుండం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో క్యాంపు పెట్టాలని సూచించినట్టు తెలుస్తుంది. గురువారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌ నుంచి అభ్యర్థులు కుటుంబ సభ్యులతో క్యాంపునకు తరలివెళ్లారు. ఫలితాల్లో బీజేపీకి ఆశించిన సీట్లు వస్తే ఆ పార్టీ మద్దతు కూడా తీసుకుందామనే ఆలోచనతో బీఆర్‌ఎస్‌ నాయక త్వం ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్‌ రెబల్స్‌గా ఉన్న ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి గెలుపొందిన వారు, ఒకరిద్దరు ఇండిపెండెంట్లు తమకు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే రామగుండంలో పలు డివిజన్లలో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ జరిగింది. రెండు పార్టీ జతకట్టి మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలు స్తుంది. క్యాంపు ఖర్చుల విషయంలో అదిష్టానం హామి ఇవ్వడంతో ఫలితాలకు ఒక రోజు ముందుగానే క్యాంపునకు తరలివెళ్లారు.

Updated Date - Feb 12 , 2026 | 11:54 PM