Share News

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:48 PM

రామగుండం మున్సిపల్‌ కార్పొరే షన్‌ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోదావ రిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

కోల్‌సిటీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్‌ కార్పొరే షన్‌ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోదావ రిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానున్నది. 60డివిజన్లకు గాను 1వ డివిజన్‌ ఏకగ్రీవం కావడంతో 59డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. ఇందులో 13, 15, 31డివిజన్లలో ఇద్దరు చొప్పున అభ్యర్థులు ఉండగా 48వ డివిజన్‌లో అత్యధికంగా 13మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో టేబుల్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు రిటర్నింగ్‌ అధి కారి పర్యవేక్షుడిగా, ముగ్గురు సిబ్బంది లెక్కింపు ప్రక్రియ చేయనున్నారు. 25 ఓట్లను ఒక కట్టగా కట్టి ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్లను లెక్కిం చనున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో కొన్ని డివిజన్లలో రెండు రౌండ్లు, కొన్ని డివిజన్లలో మూడు రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తికానున్నది. కార్పొ రేషన్‌లో 467పోస్టల్‌ ఓట్లు ఉన్నాయి. మొదట పోస్టల్‌ ఓట్లు లెక్కించిన తరువాత డివిజన్ల ఓట్లను లెక్కిస్తారు. మొదటగా 15, 31 డివిజన్ల ఫలి తాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు డివిజన్లలో ఇద్దరు అభ్యర్థుల చొప్పున బరిలో ఉన్నారు. 15వ డివిజన్‌లో 1717ఓట్లు, 31వ డివిజన్‌లో 1991ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లలో ఈ రెండు డివిజన్ల ఫలితాలు వెలువడనున్నాయి. స్థానిక 48వ డివిజన్‌లో 13మంది అభ్యర్థులు ఉన్నా 1908ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎక్కువ ఓట్లు పోలైన 42, 44 డివిజ న్లలో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2గంటల వరకు ఫలితాలు వెలువడుతాయి.

పెద్దపల్లిటౌన్‌, (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మున్సిపాలిటీకి జరిగిన మున్సి పల్‌ సాధారణ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సహా య ఎన్నికల అధికారి మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ శుక్రవారం మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద యం 8 గంటల నుంచి లెక్కింపు మొదలు పెడుతారన్నారు. 6 కౌంటింగ్‌ హాళ్ళలో 36 టేబుళ్ళు ఉంటాయని, మొత్తం 120 మంది ఎన్నికల సిబ్బంది, 30 మంది కార్మికులు, మరో 30 సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. ఒక్కో టేబుల్‌పై పోటీ చేసిన అభ్యర్థుల లెక్క ప్రకారం ట్రేలు ఏర్పాటుతో పాటు ఒక్కటి నోటా, మరోకటి చెల్లని నోట్లకు కేటాయిస్తామన్నారు. ప్రతి అభ్యర్థి ఎలక్షన్‌ ఏజెంట్‌, కౌంటింగ్‌ ఏజెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీ సర్‌ ద్వారా పాస్‌ పొందాలని సూచించారు. 36 టేబు ళ్ళు ఒకే సారి లెక్కింపు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల లెక్కింపు కోసం పోలీస్‌ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. మొత్తం 150 మంది సిబ్బంది పాల్గొననున్నారని, గెలుపొందిన విజేతలు ర్యాలీలు సంబురాలు జరుపుకోవద్దని సూచించారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): మంథని మున్సిపల్‌ ఎన్ని కల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్‌ పోలింగ్‌ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ మనోహర్‌ తెలిపారు. పోలింగ్‌ అనంతరం ప్రభుత్వ హైస్కూల్‌లో 26 బ్యాలెట్‌ బాక్స్‌లను స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. ఇదే పై అంతుస్తులో మూడు హాళ్ళలో 13 టేబుల్స్‌ను ఏర్పాటు చేసి కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి హాల్‌లో 1-7 వార్డులు, రెండో హాల్‌లో 8-10, మూడో హాల్‌లో 11-13 వార్డుల కౌంటింగ్‌ టేబుల్స్‌ను ఏర్పాటుచేశారు. ప్రతి టేబుల్‌ వద్ద ఆర్వోలు, ఏఆర్వో లు, ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ సూపర్‌ వైజర్లను నియమించారు. వీరితోపాటు అభ్యర్థి, కౌంటిం గ్‌ ఏజెంటు ఉంటారు. అభ్యర్థులను, కౌంటింగ్‌ ఏజెం ట్స్‌ను ఉదయం 7 గంటలకు అనుమతించిన అనం తరం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకే వార్డుల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ మున్సి పాలిటీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అథారిటీ, మున్సిపల్‌ కమిషనర్‌ టి రమేష్‌ తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించారు. 15 వార్డులు బ్యాలెట్‌ పేపర్లను వార్డుల వారీగా ఏర్పాటు చేసిన టేబుల్స్‌ వద్ద కట్టలు కట్టిన అనంతరం కౌంటింగ్‌ ప్రారంభిస్తామన్నారు. ఒక్కో వార్డు టేబుల్‌ వద్ద ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌తో పాటు ఇద్దరు అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు ఉంటారన్నారు. కౌంటింగ్‌ ప్రారంభించిన రెండు గంటల్లో ఫలితాలు వెలువడుతా యన్నారు. 15 వార్డులకు సంబందించిన కౌంటింగ్‌ను ఐదు గదుల్లో ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:48 PM