Home » Singanamala
మండల కేంద్రంలోని ఎరువుల దు కాణాలను, వాటి గోడౌనలను తహసీల్దార్ అరుణకుమారి, వ్యవసాయాధికారి చెన్నవీరస్వామి సోమవారం తనిఖీ చేశారు.
తొలగించిన తమ పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. మండలంలోని పింఛన తొలిగిస్తున్నట్లు 370 మంది దివ్యాంగులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో దివ్యాంగులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనై సోమవారం మండలకేంద్రానికి తరలివచ్చి అనంతపురం - తాడిపత్రి రహదారిపై బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యూవల్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. నార్పల, గార్లదిన్నెలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి సోమవారం ర్యాలీలు నిర్వహించారు.
మండలంలోని శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. ముందస్తు వర్షాలకు వేరుశనగ పంటను సాగుచేశారు. తరువాత వర్షం రాకపోవడంతో ఆ పంట ఎండుముఖం పట్టింది.
మండలంలోని గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలో హుండీల లెక్కింపును శుక్రవారం నిర్వహించారు.
‘గత ఐదేళ్ల వైసీపీ హయాంలో టీ డీపీ కార్యక ర్తల కష్టాన్ని కళ్లారా చూశాం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన కార్యక ర్తలకు తప్పక న్యాయం చేస్తాం. కార్యకర్త ల రుణం తీర్చు కోలేనిది.’ అని శింగనమల నియోజకవర్గం మినీ మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలకేంద్రమైన గార్లదిన్నెలోని మర్తాడు క్రాస్ వద్ద టీ కన్వెన్షన హాల్‌లో మినీ మహానాడు ను బుధవారం నిర్వహించారు.
అర్జీలు పునరావృతం కాకుండా న్యాయమైన పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అధికారులకు సూచించారు. శింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలో చెరువు కట్ట వద్ద ఉన్న శ్రీ షిర్డీసాయి కల్యాణమండపంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి.
మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎవరికి ఉపాధిని కల్పిస్తోందో తెలి యడం లేదు. కూలీలకు ఉపాధి దేవుడికి తెలియాకానీ, అక్రమార్కుల పా లిట కల్పతరువుగా మారింది. తాము చెప్పినట్లు వినకపోతే నాయకుల కు, అధికారులకు చెప్పి మిమ్మల్ని తొలగిస్తామని పలు గ్రామాలలో క్షేత్ర స్థాయి లో ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఈ ఒత్తిళ్లతో కొంత మంది పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు మస్టర్లలో పేర్లు ఎక్కించాల్సిన పరి స్థితి నెలకొందని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చర్చించుకుంటున్నారు.
నియోజకవర్గం అభివృద్ధికి నిధులను కేటాయించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలసి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ జిల్లా ఇనచార్జ్ మంత్రి టీజీ భరతను కోరారు. శుక్రవారం అనంతపురానికి వచ్చిన మంత్రి భరతను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మర్వాద పూర్వకంగా కలసి, నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
చీనీ రైతులకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్యాన శాఖాధికారి రత్నకుమార్ పే ర్కొన్నారు. గురువారం స్థానిక రైతు సేవా కేంద్రంలో ఉద్యాన రైతులకు, ఏపీఎంఐపీలోని ఎఫ్సిఓలకు డ్రోన సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముకుందాపురం గ్రా మంలో చీనీ తోటలను సందర్శించారు.